హైదరాబాద్ TO పూణే.. 5 ట్రెక్కింగ్ స్పాట్స్.. ఎలా వెళ్లాలి..?

మీకు ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఉందా..? కొండ కోనల్లో పచ్చని ప్రకృతి మధ్య.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రెక్కింగ్ చేయాలని ఉందా..? అయితే మహారాష్ట్రలోని పూణే ఇందుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. వీకెండ్ అడ్వెంచర్ కు ఇవి బెస్ట్ స్పాట్స్ గా నిలుస్తున్నాయి. చుట్టూ సహ్యాద్రి పర్వతాల నడుమ ఈ ట్రెక్కింగ్ ను ఆస్వాధించవచ్చు. పూణేలోని ట్రెక్కింగ్ పర్వతాలకు నవంబర్, డిసెంబర్ లో అత్యధికంగా పర్యటకులు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ లోహాగఢ్ ఫోర్ట్ ట్రెక్, టికోనా ఫోర్ట్ ట్రెక్, రాజ్ మచి ఫోర్ట్ ట్రెక్, సిన్హాగఢ్ ఫోర్ట్ ట్రెక్, కొరిగాఢ్ ఫోర్ట్ ట్రెక్.. చాలా ఫేమస్.. మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా చేరుకోవాలి..?

హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో అయితే కేవలం గంటలోనే పూణే కు వెళ్లొచ్చు. రైళ్లో అయితే 9-10 గంటలు పడుతుంది. నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు చేరుకోవచ్చు. ఇక రోడ్డు మార్గం అయితే 560 కి. మీ. ఎన్ హెచ్ 65 పై ప్రయాణించాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో వెళ్లేవారు మధ్యలో ఫుడ్, ఛాయ్ స్టాల్స్ వద్ద ఆగి సేదతీరుతూ ప్రయాణం చేయవచ్చు. పూణే చేరుకుంటే కేవలం 2 గంటల జర్నీ లోపే ఐదు రకాల ట్రెక్కింగ్ ఫోర్ట్ లు అందుబాటులో ఉన్నాయి.

లోహగఢ్ ఫోర్ట్ ట్రెక్(3,389 ft) ఉంటుంది. పూణే నుంచి 60 కి. మీ. దూరంలో ఉంది. 2 గంటల్లో ఈ కొండను ట్రెక్కింగ్ చేయొచ్చు. పావ్నా లేక్, భజ అండ్ కర్లా గుహలు, అలాగే ఒత్తయిన పచ్చిక బయళ్ల మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ కోటకు దాదాపు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రెండోది తికోనా ఫోర్ట్ ట్రెక్(3,500 ft).. ఇది పూణే నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పావ్నా డ్యామ్, త్రయంబకేశ్వర్ ఆలయం, కామ్ షెట్ కంట్రీ సైడ్ లాంటి స్పాట్స్ ను ఆస్వాధించవచ్చు.

Hyderabad s Gateway to Lohagad Glory Weekend Iron Fort Invasion

ఇక మూడోది రాజ్ మచి ఫోర్ట్ ట్రెక్(2,710 ft).. పూణే నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటను 2.5 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఇక్కడే పలు వాటర్ ఫాల్స్, ట్విన్ ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. నాలుగోది సిన్హాగఢ్ ఫోర్ట్ ట్రెక్(4,320 ft).. పూణే నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రెక్కింగ్ టైమ్ 1.5 గంటలు ఉంటుంది. ఇక ఐదోది కొరిగాఢ్ ఫోర్ట్ ట్రెక్(3,050 ft).. ఇది పూణే నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంబీ వ్యాలీకి దగ్గరలోనే ఉంటుంది. ఈ కొండ ట్రెక్కింగ్ టైమ్ 1.5 గంటల నుంచి 2 గంటలు ఉంటుంది. పూణే వీకెండ్ ట్రిప్ లో భాగంగా ఒకేసారి 5 ట్రెక్కింగ్ స్పాట్స్ ను ఒకేసారి కవర్ చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+