హైదరాబాద్ లో అత్యంత ఎత్తయిన భవనం.. 72 అంతస్తులతో ప్రపంచంలోనే..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 72 అంతస్తుల భవనం.. అది కూడా మన హైదరాబాద్ లో.. ఘట్ కేసర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ భవనం.. దక్షిణాసియాలోనే ఎత్తయిన భవనంగా గుర్తింపు పొందనుంది. 72 అంతస్తుల ఈ ఇంద్ర భవనంలో ఎంతో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ప్రతి 30 అంతస్తులకు భవనం నిర్మాణం పూర్తిగా మారిపోతుంది. ఒంపులు తిరుగుతూ ఈ బిల్డింగ్ సందర్శకులను కనువిందు చేయనున్నట్లు సమాచారం. ఈ భవనం నిర్మాణం కోసం ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ అనుమతుల కోసం అగ్నిమాపక శాఖను సంప్రదించినట్లు ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు.
హైదరాబాద్ మహానగరం రోజురోజుకీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. విశాలమైన రహదారులు.. ఆకాశాన్ని తాకే ఎత్తయిన భవనాలు.. ఇప్పుడు హైదరాబాద్ లో వేగంగా నిర్మితమవుతున్నాయి. గతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ కోల్డ్ వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్ (సీబీఆర్‌ఈ) ఏషియన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించిన అధ్యయనంలో.. ఎత్తయిన భవనాల్లో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు స్పష్టమైంది. హైదరాబాద్ కు ఉన్న అనేక భౌగోళిక అనుకూలతల కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతున్న ఈ క్రమంలో ఘట్ కేసర్ లో 72 అంతస్తుల భారీ భవనం నిర్మాణం కాబోతుంది. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భవనం నిర్మాణం కోసం ఓ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు అనుమతుల కోసం అగ్నిమాపక శాఖను సంప్రదించినట్లు ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తయిన భవనంగా నిలవనున్నట్లు వివరించారు.

అలాగే ఈ బిల్డింగ్ పూర్తయితే ఘట్ కేసర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ భవనాన్ని అత్యంత సుందరంగా నిర్మించనున్నట్లు సమాచారం. డాన్సింగ్ డెఫోడైల్ థీమ్ తో ప్రత్యేక డిజైన్ తో ఈ బిల్డింగ్ ఆకృతి ఉండనుంది. ప్రతి 30 అంతస్తులకు బిల్డింగ్ డిజైన్, నిర్మాణంలో మార్పులు ఉంటాయి. దూరం నుంచి చూస్తే భవనం స్థిరంగా కనిపించకుండా, గాలిలో మెలికలు తిరుగుతున్నట్టుగా కనిపించేలా నిర్మాణం చేస్తున్నారు. విశ్వనగరం, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని భారీ ప్రాజెక్టులు రావచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications