Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధికారులకు హైడ్రా ఇస్తున్న షాక్ మామూలుగా లేదుగా!

హైదరాబాద్లో హైడ్రా చెప్పినట్టే చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులలోనూ,బఫర్ జోన్లలోను నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి భవనాన్ని కూడా కూల్చివేసింది హైడ్రా. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుడుతుంది.

హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపైన కేసులు
అయితే ఇదే సమయంలో కొందరు సామాన్యుల భవనాలు కూడా ఎఫ్టిఎల్ పరిధిలోను, బఫర్ జోన్లలోను ఉండడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఎఫ్డిఎల్ పరిధిలో కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై యాక్షన్ తీసుకోవాలని హైడ్రా ఇటీవల సైబరాబాద్ కు సిఫార్సు చేసింది. హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపైన సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Hydra shock for six officers Tension in official circles with cases

పోలీసులు కేసులు నమోదు
బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ ఎం డి ఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ పైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

వణుకు పుట్టిస్తున్న కూల్చివేతలపర్వం
ప్రస్తుతం అధికారులపై కేసులు నమోదు కావడంతో అధికారిక వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది. తాజా పరిణామంతో ఎఫ్డీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కొందరు అధికారుల గుండెల్లో వణుకు పుడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ కొనసాగిస్తున్న కూల్చివేతలపర్వం ఇటు రాజకీయ నాయకులకు సైతం దడ పుట్టిస్తుంది.

క్రిమినల్ చర్యలకు వెనుకాడకుండా హైడ్రా
ఎప్పుడు ఎవరి నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారో అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ అని తెలిసిన కూడా కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బాంబు పేల్చడంతో అధికారులు మల్లగులాలు పడుతున్నారు.

హైదరాబాద్ లోనే కాదు తెలంగాణా వ్యాప్తంగా డిమాండ్
ఇక హైదరాబాద్లో కొనసాగుతున్న ఈ చర్యలు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే వ్యవస్థను తీసుకొచ్చి ఆక్రమణలకు చెక్ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనకు కారణంగా మారుతుంది. ఇప్పటికే అన్ని జిల్లాలలోనూ ఇలాంటి వ్యవస్థను తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. వరంగల్లో వాడ్రా, కరీంనగర్లో కాడ్రా, ఆదిలాబాద్ లో ఆడ్రా ఇలా అన్ని జిల్లాలలోనూ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలపైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని, అనుమతులు ఇచ్చిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+