i bomma రవి కేసు నేను వాదిస్తా.. లాయర్ల పోటీతో మనోడు హీరో అయ్యాడుగా!
ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని సినిమాల పైరసీ కేసుతో పాటు బెట్టింగ్ యాప్ లు, డార్క్ వెబ్ వంటి సైబర్ నేరాలకు పాల్పడినందుకు పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సామాన్య, మధ్యతరగతి ప్రజల నుండి, తీన్మార్ మల్లన్న వంటి రాజకీయ నాయకుల నుండి విశేషంగా మద్దతు లభించింది.
ఐ బొమ్మ రవి కేసు వాదించటానికి లాయర్ల పోటీ
ఈ క్రమంలో ఐ బొమ్మ రవి కేసును వాదించడానికి లాయర్లు నేనంటే నేనంటూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఐ బొమ్మ రవి కేసును వాదించడానికి ఏపీలో వైఎస్ జగన్ కోడి కత్తి, గులకరాయి కేసులను వాదించిన లాయర్ సలీం సిద్ధం కాగా, తాజాగా మరొక హైకోర్టు అడ్వకేట్ ఐ బొమ్మ రవి కేసును తాను వాదిస్తానని, నిర్దోషిగా బయటకు తీసుకు వస్తానని సంచలన ప్రకటన చేశారు.

బెయిల్ పై రవిని బయటకు తీసుకొస్తా : హైకోర్టు అడ్వకేట్
ఏపీ హైకోర్టు లాయర్ పెటేటి రాజారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక ప్రకటన చేశారు. ఇమ్మడి రవి కేసులో తన కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే అతనిని బెయిల్ పైన బయటకు తీసుకువస్తానని ఆయన తెలిపారు. రవి మీద పెట్టిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అన్నారు.
ప్రజల పక్షాన రవి కోసం వాదిస్తానని ప్రకటన
త్వరలో రవి తండ్రిని కలిసి అతనికి ధైర్యం చెబుతానని వెల్లడించారు. ఇమ్మడి రవి చేసింది తప్పే కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు అతనికి మద్దతు తెలుపుతున్నారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల పక్షాన న్యాయస్థానంలో రవి కోసం తాను వాదిస్తానని, న్యాయాన్ని గెలిపిస్తానని, త్వరలోనే రవిని నిర్దోషిగా బయటకు తీసుకు వస్తానని రాజారావు వెల్లడించారు.
పైరసీ ప్రపంచంలో లీడర్ గా ఎదిగిన రవి
పైరసీ ప్రపంచంలో తిరుగులేని లీడర్ గా ఎదిగిన రవి కేవలం ఆరు సంవత్సరాల వ్యవధి లోని ఐ బొమ్మ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాడు. దేశ విదేశాలలో తన పైరసీ సామ్రాజ్యాన్ని నడిపించాడు. చివరకు తనను పోలీసులు పట్టుకోలేరని పోలీసులకే సవాల్ విసిరారు. దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు.
పైరసీ కేసు, సైబర్ నేరాల నిందితుడు రవి కోసం లాయర్ల పోటీ
ఒక ఈ-మెయిల్ లింక్ ద్వారా నిఘా పెట్టిన పోలీసులు, ఇమ్మడి రవి హైదరాబాద్ కు వచ్చినట్టు నిర్ధారించుకుని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసిన నాటినుండి సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా జనం గళం వినిపిస్తున్నారు. దీంతో పైరసీ కేసు, సైబర్ నేరాల నిందితుడు రవి కోసం కేసు వాదించడానికి లాయర్లు పోటీపడుతున్నారు.












Click it and Unblock the Notifications