ముదురుతున్న వివాదం: తగ్గని రేవంత్‌రెడ్డి
టిడిపిలో రేవంత్ వివాదం మరింత ముదురుతోంది. టిడిఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎల్.రమణ ఆదేశించిన తర్వాత రేవంత్‌రెడ్డి అమీతుమీకి సిద్దమమయ్యారు.
హైదరాబాద్: టిడిపిలో రేవంత్ వివాదం మరింత ముదురుతోంది. టిడిఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎల్.రమణ ఆదేశించిన తర్వాత రేవంత్‌రెడ్డి అమీతుమీకి సిద్దమమయ్యారు. అక్టోబర్ 26వ, తేదిన టిడిపి శాసనసభపక్ష సమావేశం నిర్వహిస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తనతో ఉండేవారంతా ఈ సమావేశానికి హజరుకావాలని రేవంత్‌రెడ్డి సమాచారం పంపారు.
Recommended Video

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహరశైలిపై టిడిపి నాయకత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ మేరకు రేవంత్‌ను పార్టీ పదవుల నుండి తప్పించాలంటూ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ లేఖ రాశారు. ఈ లేఖపై రేవంత్‌రెడ్డి కూడ ఏ మాత్రం తగ్గడం లేదు.
టిడిపిలో రేవంత్ ఎపిసోడ్‌పై పార్టీ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారంపై రేవంత్‌రెడ్డి నుండి స్పష్టమైన వివరణ రానందున టిడిపి నేతలు ఆయనపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల నుండి రేవంత్‌ను తప్పించాలని చంద్రబాబును కోరారు.

టిడిఎల్పీ సమావేశం నిర్వహిస్తామన్న రేవంత్
టిడిఎల్పీ సమావేశం నిర్వహించాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు టిడిఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని టిడిఎల్పీ సమావేశం నిర్వహించకూడదని ఎల్. రమణ ఆదేశించారు.అయితే టిడిఎల్పీ సమావేశం నిర్వహించాలనే పట్టుదలతో రేవంత్‌రెడ్డి ఉన్నారు. టిడిఎల్పీ సమావేశాన్ని అడ్డుకొనే హక్కు ఎవరీకీ లేదని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

నాతో ఉండేవారంతా నా వెంటే నడుస్తారు
తనతో ఉండేవారంతా తనతోనే నడుస్తారనే ధీమాను టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో కొనసాగుతున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్‌బినగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యలు ఉన్నారు. అయితే టిడిఎల్పీ సమావేశానికి హజరుకావాలని రేవంత్‌రెడ్డి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సమాచారం పంపారు. అయితే ఈ సమావేశానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హజరౌతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.అయితే తనతో నడిచేవారంతా తన వెంటే ఉంటారని రేవంత్ వ్యాఖ్యానించినట్టు సాగుతున్న ప్రచారం టిడిపిలో గందరగోళానికి కారణంగా మారింది.

రేవంత్ ఇలా శాసనసభపక్షనేతగా
టిడిపి శాసనసభపక్ష నేతగా రేవంత్‌రెడ్డి పదవిని దక్కించుకోవడం వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకొన్నాయి. టిడిపి శాసనసభపక్ష నాయకుడిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు తన వెంట కొందరు ఎమ్మెల్యేలతో కలిసి టిఆర్ఎస్‌లో చేరారు. అయితే టిఆర్ఎస్‌లో చేరిన తర్వాత టిడిపి శాసనసభపక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు దయాకర్‌రావు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. అయితే ఎర్రబెల్లి దయాకర్‌రావును పార్టీ శాసనసభపక్షనేత పదవి నుండి తప్పించి రేవంత్‌ను నియమించినట్టు చంద్రబాబునాయుడు స్పీకర్‌కు లేఖ రాశారు. దీంతో రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ నేతగా కొనసాగుతున్నారు.

తాడో పేడో తేల్చుకొనేందుకు సిద్దమైన రేవంత్
టిడిపిలో సంక్షోభం ముదిరినట్టు కన్పిస్తోంది. రేవంత్‌రెడ్డి కూడ టిడిపి నాయకత్వంపై తాడో పేడో తేల్చుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్టు కన్పిస్తోంది. టిడిఎల్పీ సమావేశం నిర్వహిస్తానని రేవంత్ ప్రకటించడం ఇదే రకమైన సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుండి రాకముందే రేవంత్ వ్యవహరాన్ని తేల్చాలనే అభిప్రాయంతో నేతలున్నట్టు కన్పిస్తోంది. అక్టోబర్ 26వ, తేదిన విదేశాల నుండి చంద్రబాబునాయుడు తిరిగిరానున్నారు. అయితే బాబు వచ్చిన తర్వాత రేవంత్ ఎపిసోడ్‌లో స్పష్టత రానుంది.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications