Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలంటూ..

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా జలుబుతో ఇబ్బందిపడ్డారు. పదేపదే టవల్ అడ్డుపెట్టుకుని తమ్ముతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురిలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై కొంతమంది నెటిజెన్స్ ట్విట్టర్‌లో నేరుగా ఆయన్నే ఆరా తీశారు.

'సార్ నిన్న మీరు సిరిసిల్లలో ఫ్లూ లక్షణాలతో బాధపడినట్టు తెలిసి కలత చెందాను. కోవిడ్-19 వారియర్‌గా మీ ఆరోగ్యంపై మాకు ఆందోళన ఉంది. మీరే మా భరోసా. కాబట్టి మీ ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వండి.' అంటూ ఓ నెటిజెన్ కేటీఆర్‌ను ట్విట్టర్‌లో ఆరా తీశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. 'నా ఆరోగ్యం పట్ల మీ స్పందనకు ధన్యవాదాలు సార్.. ప్రస్తుతం నేను బాగున్నా..' అని స్పష్టతనిచ్చారు.

iam perfectly well now says minister ktr about his health

చాలా ఏళ్లుగా తాను అలర్జిక్ సమస్యతో బాధపడుతున్నానని.. నిన్న సిరిసిల్లకు వెళ్తుండగా హఠాత్తుగా మళ్లీ అలర్జీ బారినపడ్డానని చెప్పారు. ముందే నిర్ణయించిన కార్యక్రమం కావడంతో.. చివరి నిమిషంలో రద్దు చేసుకుంటే ప్రజలు ఇబ్బందిపడుతారన్న ఉద్దేశంతో సిరిసిల్లకు వెళ్లినట్టు చెప్పారు. తనవల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కోరారు. చాలామంది నెటిజెన్స్ కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందిస్తూ.. సార్ ఆరోగ్యం జాగ్రత్త అని సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+