ఆ వీడియో దృశ్యాలు ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ, చంపుతారామో,నాకు కెసిఆర్‌కు మధ్యే పోటీ: కోమటిరెడ్డి

హైదరాబాద్: ఉప ఎన్నికలకు తాను సిద్దంగా ఉన్నానని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌ లాంటివని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీని తనకు కెసిఆర్ మధ్య పోటీగా వెంకట్ రెడ్డి అభివర్ణించారు. తనను హత్య చేస్తారనే అనుమానాలు కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తం చేశారు. అయినా తాను ఎవరికీ భయపడేది లేదన్నారు.

శాసనసభ సభ్యత్వం రద్దైన తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకొన్న పరిణామాలను ప్రస్తావించారు.

తాను గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్‌ఫోన్ విసరలేదని వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై వీడియో పుటేజీ కోసం స్పీకర్‌కు ఆర్టీఐ చట్టం కింద ధరఖాస్తు చేసినట్టు కూడ ఆయన చెప్పారు.

హెడ్ ఫోన్ విసరలేదు

హెడ్ ఫోన్ విసరలేదు

గవర్నర్ ప్రసంగం సందర్భంగా తాను గవర్నర్ పైకి హెడ్ ఫోన్ విసరలేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపివేసినట్టు చెప్పారు. తాను విసిరినట్టుగా చెబుతున్న హెడ్‌ఫోన్ గవర్నర్, స్పీకర్, శాసనమండలి ఛైర్మెన్‌కు తగిలినట్టుగా నిరూపిస్తే తానే రాజీనామాను చేయనున్నట్టు చెప్పారు. రాజకీయాలకు దూరం కానున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో పుటేజీ కోసం స్పీకర్‌కు ఆర్టీఐ చట్టం కింద లేఖ రాసినట్టు చెప్పారు.

నన్ను చంపుతారామో అయినా భయపడను

నన్ను చంపుతారామో అయినా భయపడను


నన్ను చంపుతారామోనని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలపై మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. అయినా తాను భయపడేది లేదన్నారు. ప్రజలు, దేవుడే తనకు అండగా నిలుస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ప్రాణం పోయేంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు.

నాకు కెసిఆర్ మధ్య పోటీ

నాకు కెసిఆర్ మధ్య పోటీ

తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.మరో వైపు ఉప ఎన్నికలకు కూడ తాను సిద్దంగా ఉన్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికలు కెసిఆర్‌కు తనకు మధ్యే పోటీగా ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండ అసెంబ్లీ స్థానంలో తనకు ఎదురేలేదన్నారు. కెసిఆర్ కుటుంబం నుండి ఎవరైనా పోటీ చేస్తే తనకు కొంత పోటీ ఉండే అవకాశం ఉందన్నారు.

హరీష్ రావు నాకు మిత్రుడు

హరీష్ రావు నాకు మిత్రుడు

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తనకు మంచి మిత్రుడని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కానీ, తన మిత్రుడే తన శాసనసభసభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం తనకు భాదగా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కెసిఆర్, కెటిఆర్ , కవిత కంటే హరీష్ రావు చాలా కష్టపడుతున్నాడని ఆయన చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి తాను ఈ విషయం చెబుతున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

నిబంధనలకు వ్యతిరేకంగా శాసనసభ్యత్వం రద్దు

నిబంధనలకు వ్యతిరేకంగా శాసనసభ్యత్వం రద్దు

నిబంధనలకు వ్యతిరేకంగా శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై గవర్నర్ విచారణ జరిపి స్పీకర్‌కు చెప్పాలన్నారు. దీనిపై ఎథిక్స్ కమిటి విచారించాలన్నారు. ప్రివిలేజ్ కమిటీ దీనిపై చర్యకు స్పీకర్ కు సిపారసు చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కానీ, నిబంధనలకు విరుద్దంగా శాసనసభ్యత్వాలను రద్దు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+