Smita Sabharwal: స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్..

గత ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించారు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. ప్రస్తుతం ఆమె ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆమె తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయం చాలా ముఖ్యమైనది.. తలపైకి ఎత్తి బలంగా నడవాలి' అంటూ ఎమోషన్ ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్. స్మిత సబర్వాల్ పోస్ట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. మీరు ఒక మంచి అధికారి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు నడవండి అంటూ కోరుతున్నారు. అయితే ఆమె కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ పనులు చూసుకున్నారు. అయితే రెండింటీలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడగడ్డ బ్యారేజీ కుంగడంతో ఆ ప్రాజెక్ట్ అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోందని చెబున్నారు. దీంతో ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. సీఎంవో కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.

IAS officer Smita Sabharwal posted an emotional post on social media

గతంలో మిషన్ భగీరథ పనులు చూస్తున్నప్పుడు స్మితా సబర్వాల్ నియంతగా వ్యవహించేవారని ఆరోపణలు వచ్చాయి. మిషన్ భగీరథలో ఔట్ సోర్సింగ్ లో పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేదని చెబుతున్నారు. అయితే సీతక్క మంత్రి అయిన కొత్తలో స్మితా సబర్వాల్ సీతక్కను కలిశారు. ఈ క్రమంలో సీతక్క మామూలుగా కూర్చుంటే.. స్మితా సబర్వాల్ మాత్రం కాలుపై కాలేసుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇలానే కేసీఆర్ ముందో, కేటీఆర్ ముందో స్మితా కూర్చుంటారా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. బుధువారం కూడా స్మిత సబర్వాల్ ఓ ట్వీట్ చేశారు. "భూమిపై ఉన్న ప్రతి దేశంలో విజయానికి సంబంధించిన విత్తనాలు మహిళలు, పిల్లలలో ఉత్తమంగా నాటబడతాయి. ఆమెకు పుస్తకాలు, పెన్ను మరియు కొంత అదనపు శ్రద్ధ ఇవ్వండి. ఆమె ప్రకాశించేలా చూడండి" అంటూ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+