ఐబొమ్మ రవి కేసు.. మరిన్ని సంచలన విషయాలు బయటకు
ఐ బొమ్మ రవి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రవి.. ప్రముఖ సామాజిక మాధ్యమమైన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా హెచ్ డీ సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్యూబ్ నెట్ వర్క్ ను శాటిలైట్ లింక్ ను హ్యాకింగ్ చేసి హెచ్ డీ ఫార్మాట్ లో మూవీని రికార్డు చేసినట్లు సమాచారం అందుతోంది.
ఇక ఇటీవల ఐ బొమ్మ రవిపై మరో నాలుగు కేసులు నమోదు కాగా.. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఒక్కో కేసులో ఐబొమ్మ రవిని మూడు రోజులపాటు విచారించాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18 గురువారం నుంచి ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ అంశాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం.
నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు మరో 12 రోజులపాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు.. విచారణలో మరిన్ని సంచలన విషయాలను తెలుసుకున్నారు. ఐ బొమ్మ రవి.. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా హెచ్ డీ సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
థియేటర్లలో ప్లే చేసే క్యూబ్ నెట్ వర్క్ శాటిలైట్ లింక్ ను హ్యాకింగ్ చేసి హెచ్ డీ ఫార్మాట్ లో మూవీని రికార్డు చేసినట్లు సమాచారం అందుతోంది. హెచ్ డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ను క్రియేట్ చేసి సినిమాలనుంచి 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. హిట్, తండేల్, కిష్కిందపురి సినిమాలను ఈ విధంగానే పైరసీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక తెలుగుతోపాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టాలను తీసుకొచ్చిన ఐ బొమ్మ వెబ్ సైట్ ను ఎట్టకేలకు గతంలో హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేయించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఐ బొమ్మ రవి ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు. పట్టుకోండి చూద్దాం అంటూ సోషల్ మీడియాలో పోలీసులకు సవాల్ విసిరిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

ఈ క్రమంలో విడాకుల అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని నెల రోజులపాటు నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా నాంపల్లి కోర్టు మరో 12 రోజులపాటు కస్టడీ విధించిన నేపథ్యంలో.. పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న పూర్తి వివరాలు, ఆర్థిక లావాదేవీలు.. తదితర పూర్తి వివరాలను తెలుసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!











Click it and Unblock the Notifications