Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం పదవిపై రేవంత్ మనసులో మాట - అదే అడ్డంకా..!!

తెలంగాణ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ప్రచారం ఈ సాయంత్రం ముగియనుంది. ఈ నెల 30న పోలింగ్ లో తెలంగాణ ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది. తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఎవరికి దక్కుతుంది. ఇప్పటికే ఈ చర్చ మొదలైంది. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ కు సీఎంగా అవకాశం దక్కుతుందా. రేవంత్ కు ప్రతికూలతలు ఏమైనా ఉన్నాయా.

గెలుపుపై రేవంత్ ధీమా : తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా 80 -85 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ 25 సీట్లు దాటని గట్టిగా చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నట్లుగా అధికారంలోకి వస్తే పార్టీ సీఎం ఎవరనేది ఇప్పటికే ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ లో సీఎం సీటు కోసం ఢిల్లీ టు బెంగళూరు పలు సీన్లు కనిపించాయి.

If Congress come to power, Who will be the CM, Revanth Reaction here

ఈ సమయంలో తెలంగాణలోనూ సీఎం రేసులో పలువురు నేతలు ఉన్నారు. అయితే, పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. బీజేపీ బీసీ సీఎం నినాదంతో..కాంగ్రెస్ ఏ వర్గానికి సీఎంగా అకవాశం ఇస్తుందనేది మరో ఆసక్తి కర అంశం. ఇక, పార్టీ రద సారధిగా తెలంగాణలో ఉన్న రేవంత్ కు ఉన్న అనుకూలత - ప్రతికూలతలు కీలకంగా మారుతున్నాయి.

హైకమాండ్ లెక్క ఏంటి : కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత గెలుపులో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం గా అవకాశం ఇచ్చారు. సిద్దరామయ్య సీఎం అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి సీఎంగా హైకమాండ్ ఎవరిని నిర్ణయించినా తాను పూర్తిగా సహకరిస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో సీఎం పదవి గురించి రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

రేవంత్ కు అనుభవం లేదనే కారణంగా పదవి ఇవ్వరనే చర్చకు సమాధానం ఇచ్చారు. దేశ ప్రధానులుగా పని చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అనుభవం లేకపోయినా ఆ పదవుల్లో రాణించిన అంశాన్ని గుర్తు చేసారు. ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి వచ్చి సీఎం అయి పాలించిన తీరును ఇప్పటికీ చెప్పుకుంటున్నామని రేవంత్ వివరించారు.

If Congress come to power, Who will be the CM, Revanth Reaction here

రేవంత్ మనసులో మాట : సీఎం అవ్వాలంటే అనుభవం కంటే కమిట్ మెంట్ ముఖ్యమని రేవంత్ చెప్పుకొచ్చారు. సీఎం ఎవరైనా అధికారుల టీం ఉంటుందని...తనకు టీం లీడర్ గా పని చేసిన అనుభవం ఉందని వివరించారు. కామన్ సెన్స్ తో తాను పని చేస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో సుదీర్ఘ కాలం పని చేసిన తనకు ప్రభుత్వం లో ఏ తప్పులు చేయకూడదో తనకు అవగాహన ఉందన్నారు.

ఆ తప్పులు చేయకుండా పేదల మనసులు గెలిచే పాలన చేస్తే సక్సెస్ అవుతామని విశ్లేషించారు. అనుభవం అనేది సమస్య కాదని తన మనసులో మాట బయట పెట్టారు. దీంతో.. కాంగ్రెస్ అనుకూల అంచనాలకు అనుగుణంగా అధికారంలోకి వస్తుందా..వస్తే సీఎంగా ఎవరి వైపు హైకమాండ్ మొగ్గు చూపుతుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+