వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను హత్య చేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ :వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో భార్యను దారుణంగా హత్యచేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో జరిగింది. నవంబర్ 29వ, తేదిన బేగంటపేట వద్ద ఆటోలో వెళ్తున్న భార్యపై కత్తితో దాడి హాత్య చేసి హత్య చేసిన భర్త ఈ శ్వర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

మియాపూర్ కు చెందిన కవితతో బేంగపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీకి చెందిన ఈశ్వర్ కు 2008 లో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. కారు డ్రైవర్ గా పనిచేసేవాడు ఈశ్వర్ . ఈశ్వర్ కు మరో యువతితో వివాహేతర సంబంధం ఉంది. రెండేళ్లుగా ఈశ్వర్ రేఖ అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయమై భార్యభర్తల మద్య గొడవలు జరుగుతుండేవి.

illegal affair effect on family in hyderabad

ఈశ్వర్ కే తల్లి, సోదరి, తండ్రి మద్దతు ఇచ్చేవారు. అత్తింటి వారి వేధింపులను భరించలేక కవిత నవంబర్ 5వ, తేదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే పిల్లలను తన అత్తింటి వద్ద వదిలివెళ్ళింది. అంతేకాదు తనను వేధిస్తున్నాడని భర్తపై ఆమె బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా కౌన్సిలింగ్ కోసం నవంబర్ 29వ, తేదిన పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా కవితను పోలీసులు పిలిచారు. అయితే తన భార్య అడ్డు తొలగించుకోవాలని భావించిన రిందితుడు ఈశ్వర్ ఆటోలో ఎక్కబోతున్న కవితపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కవిత అక్కడికక్కడే మరణించింది.నిందితుడిని గురువారం నాడు అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
illegal affair effect on family. eshwar working as a car driver, he is married kavita in 2008, they have three children, past two years eshwar stay with rekha . kavita , eshwar stir about this illegal affair.nov 5, kavita went to parents house,.she complient against her husband. on nov 29, eshwar attack on kavita with blade, police arrest the eshwar.
Please Wait while comments are loading...