నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతవరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. జూలై మాసం సగం పూర్తి అయిన తరువాత ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఏపీలోని నెల్లూరు వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలకు తాజాగా భారీ వర్షాల పై హెచ్చరికలు జారీ అయ్యాయి.
మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యా యి. రానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు అటు ఏపీలోని కోస్తా ప్రాంతంలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిసాయి. తెలంగాణలోనూ ఈ రోజు (గురువారం) ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక, రేపు (శుక్రవారం) నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. అదే విధంగా శనివారం వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications