మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు కవిత షాక్.. తొలి విజయం!

తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ దూసుకుపోయిందో తేలనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడగా, ఈ అన్ని పార్టీలకు షాక్ ఇస్తూ తెలంగాణ జాగృతి కవిత ఇచ్చిన మద్దతుతో ఓ కొత్త పార్టీ జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపాలిటీ పైన జెండా ఎగురవేసింది.

ప్రధాన పార్టీలకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చిన కవిత

జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో ప్రధాన పార్టీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఎన్నికల ఫలితాలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక సంచలనం నమోదయింది. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కవిత మద్దతుతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది.

in municipal elections vaddepalli municipality won by all india forward block with kavitha support

వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయం

వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం పది వార్డులకు జరిగిన ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎనిమిది వార్డులలో విజయం సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరొక వార్డును పంచుకున్నాయి. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వశం చేసుకుంది. అయితే ఇక్కడ కవిత మద్దతు వల్లే ఇక్కడ ఈ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారన్న చర్చ జరుగుతోంది.

కవిత మద్దతు ప్రకటించిన పార్టీ విజయం

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సింహం గుర్తుతో ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలు వడ్డేపల్లిలో సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు జాగృతి కార్యకర్తలు సైతం ఈ విజయం కవిత కారణంగానే సాధ్యమైంది అంటూ జోష్ లో ఉన్నారు.మున్సిపల్ ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ పనిచేసే నాయకులను, మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన కవిత వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి తన మద్దతును ప్రకటించారు.

కవిత రాజకీయంపై చర్చ

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ వడ్డేపల్లి లో జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు ఇచ్చిన పార్టీ అభ్యర్థులకు ప్రజల విజయాన్ని కట్టబెట్టడం రాజకీయాలలో ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ విజయంతో కవిత రాజకీయ అడుగుల పైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+