KTR: హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల..

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న కేటీఆర్ బామ్మర్ది పాకాల రాజ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు
అక్రమ అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ జరిగింది. ఇందుకు సంబంధించి పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

పోలీసుల దాడుల్లో అక్కడ భారీ ఎత్తున విదేశీ మద్యం, క్యాసినోకు సంబంధించి వస్తువులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్ తీసుకున్నారని అనుమానం వారి శాంపిల్స్ సేకరించాలని నిర్ణయించారు. మహిళలను అక్కడి నుంచి పంపించి పురుషుల శాంపిల్స్ తీసుకున్నారు. విజయ్ మద్దూరి మాత్రం శాంపిల్స్ ఇవ్వడానికి నివారించారు. మూడు గంటల పాటు అతను ఇబ్బంది పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చివరికి ఆస్పత్రికి తీసుకెళ్లి రక్త పరీక్ష చేస్తామని చెప్పడంతో విజయ్ మద్దూరి శాంపిల్స్ ఇచ్చాడు. అతనికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

In the Janwada farm house case accused Raj Pakala filed a lunch motion petition in the High Court

దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు రాజా పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని పోలీసులు వదిలిపెట్టారు. తాజాగా విజయ్ మద్దూరి ఓ వీడియో విడుదల చేశాడు. తమని టార్గెట్ చేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే తాము విదేశి పర్యటనకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ తో తను చెప్పని మాటాలు చెప్పినట్లుగా రాసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు, తన కుటుంబానికి, అలాగే రాజ్ పాకాలకు ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇది తీరని అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ మద్దూరి తనకు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంపై మాట్లాడలేదు. కాగా ఇదంతా కాంగ్రెస్ కావాలనే చేస్తుందని.. పార్టీ చేసుకుంటే తప్పా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ చేసుకుంటే డ్రగ్స్ వాడతారా అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. దీపావళి పార్టీ మద్యం తాగుతారా అని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+