హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలోనే తొలిసారి: యువకుడికి ‘లివర్ ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్’ చేసిన ఉస్మానియా వైద్యులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు దేశంలోనే తొలిసారి అరుదైన శస్త్ర చికిత్స చేసి 24 ఏళ్ల పేద యువకుడికి పునర్జన్మనిచ్చారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు సైతం ధైర్యం చేయని క్లిష్టమైన కాలేయ సమస్యకు ఆటో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (స్వీయ కాలేయ మార్పిడి) పద్ధతిలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు(24) పుట్టుకతోనే క్లిష్టమైన కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య పరిభాషలో దీనిని బడ్‌-చ్యెయిరీ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. ఉదర భాగం నుంచి గుండెకు, కాలేయం నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చిన్నప్పటి నుంచే అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నా...తాత్కాలిక చికిత్సలతో నెట్టుకొస్తున్నాడు.

మూడు నెలలుగా కాలేయం పనితీరు పూర్తిగా మందగించడంతో కాళ్లు, చేతులు, పొట్ట భాగంలో రక్త నాళాలు ఉబ్బి.. తీవ్రమైన రక్త స్రావం అవుతోంది. పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చూపించగా.. ఈ సమస్యకు కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని.. రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని తేల్చారు. బీదరికంలో ఉన్న వారికి ఏంచేయాలో తోచలేదు.

తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. అతనేమో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చివరికి ఉస్మానియా వైద్యులను ఆశ్రయించారు. నాగరాజు ఆరోగ్య పరిస్థితిని గమనించిన ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘురాం, సర్జికల్‌ గాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదన్‌ బృందం చికిత్స అందించేందుకు ముందుకొచ్చింది.

కాలేయ మార్పిడి చేయాలని భావించి రెండు నెలలు వేచి చూశారు. అవయవం లభ్యం కాకపోవడం.. మరోవైపు నాగరాజు ఆరోగ్యం క్షీణించే పరిస్థితికి చేరుకోవడంతో తదుపరి చికిత్సకు సిద్ధమయ్యారు. గతంలో ఇలాంటి సమస్యకు కెనడాలోని టోరంటో గ్రూపు ఆసుపత్రి వైద్యులు స్వీయ కాలేయ మార్పిడి విధానంలో విజయవంతంగా శస్త్ర చికిత్స చేసిన వైనం నెట్‌లో చూశారు. ఇందుకు సంబంధించి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధించిన వైద్యులతో మాట్లాడారు.

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు దేశంలోనే తొలిసారి అరుదైన శస్త్ర చికిత్స చేసి 24 ఏళ్ల పేద యువకుడికి పునర్జన్మనిచ్చారు.

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

కార్పొరేట్‌ ఆస్పత్రులు సైతం ధైర్యం చేయని క్లిష్టమైన కాలేయ సమస్యకు ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌ (స్వీయ కాలేయ మార్పిడి) పద్ధతిలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

నాగరాజు ఆరోగ్య పరిస్థితిని గమనించిన ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘురాం, సర్జికల్‌ గాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదన్‌ బృందం చికిత్స అందించేందుకు ముందుకొచ్చింది.

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

కాలేయ మార్పిడి చేయాలని భావించి రెండు నెలలు వేచి చూశారు. అవయవం లభ్యం కాకపోవడం.. మరోవైపు నాగరాజు ఆరోగ్యం క్షీణించే పరిస్థితికి చేరుకోవడంతో తదుపరి చికిత్సకు సిద్ధమయ్యారు.

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

గతంలో ఇలాంటి సమస్యకు కెనడాలోని టోరంటో గ్రూపు ఆసుపత్రి వైద్యులు స్వీయ కాలేయ మార్పిడి విధానంలో విజయవంతంగా శస్త్ర చికిత్స చేసిన వైనం నెట్‌లో చూశారు. ఇందుకు సంబంధించి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధించిన వైద్యులతో మాట్లాడారు.

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

ఆటో లివర్‌ న్స్‌ప్లాంటేషన్‌

తొలుత కాలేయాన్ని బయటకు తీసి దానిని ప్రత్యేకమైన ద్రావణంలో భద్రపరిచారు. తర్వాత ఆ ప్రదేశంలో పాడైపోయిన రక్తనాళాలను కృత్రిమ పద్ధతిలో పునరుద్ధరించి రక్త సరఫరాను సరిచేశారు. తర్వాత భద్రపరచిన కాలేయాన్ని యథావిధిగా అమర్చి మార్పిడి ప్రక్రియను పూర్తి చేశామని డాక్టర మధుసూదన్‌ వివరించారు.

తొలుత కాలేయాన్ని బయటకు తీసి దానిని ప్రత్యేకమైన ద్రావణంలో భద్రపరిచారు. తర్వాత ఆ ప్రదేశంలో పాడైపోయిన రక్తనాళాలను కృత్రిమ పద్ధతిలో పునరుద్ధరించి రక్త సరఫరాను సరిచేశారు. తర్వాత భద్రపరచిన కాలేయాన్ని యథావిధిగా అమర్చి మార్పిడి ప్రక్రియను పూర్తి చేశామని డాక్టర మధుసూదన్‌ వివరించారు.

ఈ శస్త్ర చికిత్సకు సుమారు 10 గంటల సమయం పట్టిందన్నారు. డాక్టర్‌ పాండునాయక్‌, డాక్టర్‌ ఇందిర, డాక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రొ. ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ రవిమోహన్‌, డాక్టర్‌ మోక్షప్రసున్న తదితర 25 మంది బృందం ఈ శస్త్ర చికిత్సలో పాల్గొందన్నారు. ప్రస్తుతం యువకుడు పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు.

ముఖ్యంగా అతని కాలేయాన్ని తిరిగి అతనికే అమర్చడం వల్ల భవిష్యత్తులో అతని శరీరం దాన్ని తిరస్కరిస్తుందన్న భయంగాని, అలా తిరస్కరించకుండా మందులు వాడాల్సిన అవసరం గాని ఉండదని డా.మధుసూదన్‌ వివరించారు.

ఇలాంటి చికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయని తెలిపారు. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పూర్తిస్థాయిలో సహకరించారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘురాం చెప్పారు.

English summary
A team of Osmania General Hospital (OGH) doctors have performed world’s second and India’s first rare auto-transplantation liver surgery after correcting blocked important blood vessels of the liver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X