ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం.. రెండు వారాలు ప్రత్యేక శిబిరాల జాతర!

తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని నేడు ప్రారంభించి అమలు చేయనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

తాజాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లు, దరఖాస్తుల సేకరణ, ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 19న సాయంత్రం సిద్దిపేట జిల్లా నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం జరిగే సమయంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో కూడా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.

Indiramma Kutumba Jeevitha Bima Pathakam CS Sanjay jaju said to conduct special camps for two weeks

పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని సీఎస్ సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, అన్ని ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

పథకం ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అందేలా రాబోయే రెండు వారాల పాటు గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు ఫారం సేకరించాలని, బీమా పొందే వ్యక్తి వివరాలతో పాటు నామినీ వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల్లో అవసరమైన వివరాలన్నీ స్పష్టంగా, తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు.

గ్రామ, వార్డు స్థాయిలో అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకొని ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు అందేలా చర్యలు చేపట్టాలని, ఎవరూ నమోదు ప్రక్రియలో మిగిలిపోకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం, ప్రయోజనాలు, దరఖాస్తు విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సీఎస్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

తెలంగాణ ఆర్థిక వసూళ్లలో ఆసక్తికర గణాంకాలు: ఆదాయంలో హైదరాబాద్ టాప్..ఖర్చులో ఈ జిల్లా!
తెలంగాణ ఆర్థిక వసూళ్లలో ఆసక్తికర గణాంకాలు: ఆదాయంలో హైదరాబాద్ టాప్..ఖర్చులో ఈ జిల్లా!

గ్రామాల్లో మైక్ ప్రచారం, పోస్టర్లు, కర పత్రాలు, ప్రజా సమావేశాల ద్వారా పథకం వివరాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రత్యేక శిబిరాల నిర్వహణ తేదీలు, ప్రదేశాల గురించి ముందుగానే ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి పథకం సమాచారం చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రారంభోత్సవ ఏర్పాట్లు, దరఖాస్తుల సేకరణ, ప్రచార కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+