Weather Update: జూన్ 21,22న తెలంగాణలో భారీ వర్షాలు..!

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కురిసినా ఏదో ఒక చోట మాత్రమే కురుస్తుంది. దీంతో వర్షాల కురుస్తాయా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది రైతులు ఇప్పటికే వరి నారు పోశారు. అయితే వర్షాలు కురిస్తేనే నాటు వేసే అవకాశం ఉంది. దీంతో వానల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఇండో జర్మన్ నిపుణులు కూడా తెలంగాణ వాతావరణం పై పరిశోధనలు చేశారు. వారి అంచనా ప్రకారం తెలంగాణలో జూన్ 21, 22న ఏకధాటిగా వర్షాలు కురిస్తాయని ప్రకటించింది. తూర్పు తెలంగాణలో జూన్ 21న, ఉత్తర తెలంగాణలో జూన్ 22న విస్తారంగా వానలు పడతాయని ఇండో జర్మన్ నిపుణులు ప్రకటించారు. అయితే ఈసారి తెలంగాణలో తక్కువ వర్షపాతమే నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

Indo-German experts said that heavy rains are likely to occur in Telangana on June 21 and 22

ఇండో జర్మన్ నిపుణుల బృందం దేశంలో రుతుపవనాల ప్రవేశం, వాటి వల్ల కురిసే వర్షంపై అధ్యయనం చేశారు. దాదాపు పది సంవ్సతరాల పాటు పరిశోధనలు చేసి ఇండియా, ముఖ్యంగా తెలంగాణలో విషయంలో మారుతున్న వాతావరణ పరిస్థితులను వివరించారు. ఈ విషయాన్ని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సోషల్ మీడియాలో తెలిపారు. మరోవైపు సూపర్ ఎన్ నినో క్రమంగా బలహీనపడుతున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లానిన ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వివరిస్తున్నారు. జాతీయ మహాసముద్ర వాతావరణ పరిపాలన ఇందుకు సంబంధించి ఓ ప్రకటన చేసింది. జూన్‌‌ 2023లో ప్రారంభమైన 'ఎల్‌‌ నినో' ప్రభావం మే 2024 వరకు గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాలకు ఎన్నడూ చూడనంత అతి వేడిని పరిచయం చేసిందని వివరించింది. ప్రస్తుతం తటస్థ పరిస్థితి ఉందని. లానిన ఏర్పడితే ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+