GHMC: హైదరాబాద్ లో ఇక బేఫికర్.. వాటికి చెక్
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద స్మార్ట్ మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్ సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. నేడు- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ అత్యాధునిక పార్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. నగరంలో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటివరకు ఈ వ్యవస్థ లేదు.
ఈ వ్యవస్థ ద్వారా కార్లను ఆటోమేటిక్ వ్యవస్థ ద్వారా పార్క్ చేయవచ్చు. వాటిని అదే తరహాలో తిరిగి తీసుకోవచ్చు. అతి తక్కువ స్థలాన్ని ఉపయోగించుకోవడం దీని విశేషం. పార్క్ చేసిన కారు.. ఆటోమేటిక్ గా రొటేట్ అవుతూ మల్టీ లెవెల్ స్లాట్లలోకి చేరుకుంటాయి. నిర్దేశించిన స్లాట్ లోకి వాహనదారులు స్వయంగా వెళ్లి పార్క్ చేయాల్సిన అవసరం ఉండదు. మల్టీ లెవెల్ కావడం వల్ల ఇక్కడ ఒకేసారి 72 కార్లను పార్క్ చేయవచ్చు. దీనికి అదనంగా టూవీలర్ పార్కింగ్, ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మెరుగైన భద్రత కోసం లోడ్ సెన్సార్లు, ఆటో-లాకింగ్, సీసీటీవీ, అత్యవసర వ్యవస్థ వంటివి ఈ పార్కింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. తెల్లవారు జామున 5 గంటల నుండి రాత్రి 11 వరకు ఈ పార్కింగ్ కేంద్రం అందుబాటులో ఉంటుంది. నవా నిర్మాణ్ అసోసియేట్స్‌తో కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు GHMC వెల్లడించింది.
హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటి.. కేబీఆర్ పార్క్. ఈ ప్రాంతం పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ప్రధాన ఉద్దేశమని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. ఈ సౌకర్యం వల్ల రోడ్డు పక్కన ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయడాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు పూర్తిస్థాయిలో తిరిగి వినియోగంలోకి వస్తాయని, కేబీఆర్ పార్క్, చుట్టుపక్కల వాణిజ్య కేంద్రాల వద్ద ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని అన్నారు.
-
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications