ఇంటెలిజెన్స్ హెచ్చరిక: హైదరాబాద్‌లో అప్రమత్తం
హైదరాబాద్, బెంగుళూరు లక్ష్యంగా ఉగ్రదాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్: హైదరాబాద్, బెంగుళూరు లక్ష్యంగా ఉగ్రదాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు, పలు కూడళ్ల వద్ద నిఘా పెంచారు. విదేశీ రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసుకున్న బంగ్లాదేశ్ ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

దీంతో పోలీసులు నిఘాను పెంచడమే కాకుండా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులు రాష్ట్రంలోని ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికా రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ఉగ్రవాదులు, ఐసిస్‌తోపాటు పలు సంస్థలకు చెందిన ఉగ్రవాదులతో కలసి వివిధ ప్రాంతాల్లో ఎప్పుడైనా, ఏ క్షణమైనా, విధ్వంసానికి పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు రాష్ట్రాలకు సూచించినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications