Inter Exams : ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు..
Inter Exams : ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గమనిక. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించేలా ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన షెడ్యూల్‌ను ప్రభుత్వానికి పంపింది. మొత్తం మూడు షెడ్యూళ్లను ప్రభుత్వానికి పంపింది విద్యాశాఖ. అందులో 2024 ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 5 వ తేదీలు ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపినట్లు తెలిసింది. వీటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడమే తరువాయి అంశం. ఆయన అమోదం తెలపగానే పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేస్తారని సమచారం. వారం రోజుల్లో ఇక పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు, సెకండియర్ పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది కొంత ముందుగానే పరీక్షలు ముగించేలా ప్రణాళిక రూపొందించారని సమాచారం. ఇక ఇప్పటికే ఫ్రీ ఫైనల్ , ప్రాక్టికల్స్ వంటి పరీక్షలకు తేదీలను కూడా కన్ఫామ్ చేశారు. జనవరి 20 తర్వాత ఫ్రీ ఫైనల్ పరీక్షలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు సైన్స్ ప్రాక్టికల్స్ వంటి పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో పెట్టే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు గాను మొత్తం 1500 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో వీటన్నింటిపై క్లారిటీ రానుంది.

ఎపీలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ : ఇటీవలే తెలంగాణలో జరిగే ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సమావేశం నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్‌మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలను త్వరలోనే అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎపీలో పదోతరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications