ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - మాజీ సీఎస్ సోమేశ్ సహా ఆ అధికారులకూ..!!
సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. రివ్యూ కమిటీలో ఉన్న వారిని సిట్ విచారించింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ సహా.. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ తో పాటుగా మరి కొందరి అధికారుల ను సిట్ విచారణ చేసింది. వారి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వేసులో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ని వారిని సిట్ మరోసారి విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారించింది. వారి ఇచ్చిన స్టేట్‌మెంట్లను సిట్ రికార్డు చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతోపాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది.

మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను కూడా విచారించింది. ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్‌లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది.
గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతోపాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తమ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిథిగా హోం శాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనుబంధ చార్జిషీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది.
మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించారు. అయితే.. మరోవైపు ఈ కేసులో మూడో రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఆయన్ని విచారించేందుకు సిట్‌లో సభ్యుడు అయిన సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్ ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రభాకర్ రావును సిద్ధిపేట సీపీ విచారించనున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications