మహేష్ కత్తి ఇంటర్వ్యూ: ఆ యాంకర్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నిత్యం విమర్శిస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తి ఆదివారం మహా న్యూస్ ఛానల్‌లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్, టెలివిజన్ ఛానల్ దర్శకుడు ఒకరు, ఇతర నెటిజన్ల ధాటికి మహేష్ కత్తి తోకముడిచారు.

  అసలు ఎవరీ మహేష్ కత్తి?

  అంతకుముందు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొందరు రిపోర్టర్ల ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఆ తర్వాత టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూకి వెళ్లారు. ఆ సమయంలో మహా న్యూస్ ఛానల్‌లో మహేష్ కత్తి నీళ్లు నమలాల్సి వచ్చింది. దెబ్బకు ఆయన లైవ్ షో నుంచి వెళ్లిపోయారు.

  పూనమ్‌ను లాగి మరో తప్పు!: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

  బాగా సెర్చ్ చేస్తున్నారు

  బాగా సెర్చ్ చేస్తున్నారు

  ఇదే ఛానల్లో మహేష్ కత్తిని ఇంటర్వ్యూ చేసిన లహరీ శరీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇంటర్వ్యూ మాత్రమే చేసింది. ఆ షోలోనే కత్తి మహేష్ చర్చ మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో అతనిని ఇంటర్వ్యూ చేసిన లహరీ శరీ గురించి ఇప్పుడు గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో బాగా సెర్చ్ చేస్తున్నారు.

  రెచ్చిపోతున్న మహేష్ కత్తి‌: వెనుక బలమైన శక్తి, పవన్ కళ్యాణ్‌పై ప్లాన్‌తో రంగంలోకి?

  అర్జున్ రెడ్డిలో నర్సుగా

  అర్జున్ రెడ్డిలో నర్సుగా

  అదే సమయంలో ఓ ఆసక్తికర విషయం కూడా వెలుగు చూసిందని అంటున్నారు. ఆమె ఇటీవల హిట్ సినిమా అర్జున్ రెడ్డిలో నర్సుగా నటించింది. ఆమె ఇతర ప్రముఖులతోను దిగిన ఫోటోలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

  పలువురితో చిత్రాలు

  పలువురితో చిత్రాలు

  జనసేనాని పవన్ కళ్యాణ్, దర్శకులు త్రివిక్రమ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద రావు, నటులు సునీల్, అవసరాల శ్రీనివాస్ తదితరులతో దిగిన ఫోటోలు నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ కత్తి

  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ కత్తి

  కాగా, గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మహేష్ కత్తి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నటి పూనమ్ కౌర్‌పై ఆయన సంధించిన ప్రశ్నల మీద అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కత్తి మహేష్ తీరుపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Interesting on News Anchor Lahari, who questioned Mahesh Kathi in interview.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి