బీఆర్ఎస్ లో ముసలం: కేటీఆర్ వర్సెస్ కవిత.. రాజుకున్న నిప్పు వెనుక!

మాజీ సీఎం, బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కవిత లేఖ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను, పార్టీలోని అంతర్గత శత్రువులను స్పష్టం చేస్తుంది . ఇక నిన్న అమెరికా నుంచి వచ్చిన కవిత తాను రాసిన లేఖ బయటకు రావడంపైన మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు, చుట్టూ ఉన్న వాళ్ళే రాబందులు అంటూ వ్యాఖ్యలు చేశారు.

కవిత వర్సెస్ కేటీఆర్
ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్ను ఏం చేయలేరని కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యల పైన, కవిత లేఖ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ డైరెక్ట్ గా స్పందించడంతో పార్టీలో అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందన్న టాక్ నడుస్తుంది. అధినేత కెసిఆర్ కు లేఖలు రాయడం పైన కవిత పేరు ప్రస్తావన చేయకుండా కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

internal war in brs party kavitha verses ktr hot topic in telangana politics

Take a Poll

అన్నాచెల్లెళ్ల మధ్య రాజుకున్న నిప్పు
అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలని ఇలా రచ్చ చేయకూడదని హితవు పలికారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. ఇక కవిత పేరు కూడా ప్రస్తావించకుండా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అన్నాచెల్లెళ్ల మధ్య పంచాయితీకి అద్దం పడుతున్నాయి.ఇక కెసిఆర్ దేవుడని ఆయన చుట్టూ కొన్ని రాబందులు ఉన్నాయని కవిత వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయ వర్గాలలో చర్చకు కారణంగా మారాయి.

పార్టీలో తన స్థానం కోసం కవిత పోరాటం
కెసిఆర్ చుట్టూ ఉండేది ఎవరు? కేటీఆర్, హరీష్, సంతోష్, కవిత వీళ్లు తప్ప ఆయన చుట్టూ ఉండే వారు ఇంకెవరున్నారు? కవిత చేసిన వ్యాఖ్యలు తన సొంత అన్న పైనే అన్న చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను పూర్తిస్థాయిలో కేటీఆర్ కి అప్పగించే అవకాశం ఉన్న నేపథ్యంలో కవిత తన స్థానం కోసం పోరాటం చేస్తున్నట్లుగా తాజా పరిణామాలతో కనబడుతుంది.

కేసిఆర్ రంగంలోకి దిగుతారా?
ఇందులో భాగంగానే కవిత, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు పార్టీలో ఉన్న అసంతృప్తిని తేటతెల్లం చేస్తూ లేఖ రాసింది. ఇక కవిత లేఖ పార్టీ నాయకత్వ సంక్షోభాన్ని అర్థమయ్యేలా చెబుతుంది. ఈ లేఖ పై కేటీఆర్ స్పందించిన తీరు అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరును, బీఆర్ఎస్ లో ముసలం మొదలైంది అనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ఈ పరిణామాలు ముందు ముందు ఏ రూపు తీసుకుంటాయో ,పార్టీ వ్యవహారాలు బజారున పడకముందే కెసిఆర్ ఈ పరిస్థితులను చక్కదిద్దుతారా? అని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+