హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇది నాంది: పారిశ్రామికవేత్తలకు అనుమతి పత్రాలిచ్చిన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ సానుకూలతను ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత మొదటిసారి తెలంగాణలో 17 పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో అనుమతి పత్రాలను అందజేశారు. రాష్ట్రం పారిశ్రామిక స్వర్ణయుగం వైపు పురోగమనం ప్రారంభించిందని, అందుకు ఈ కార్యక్రమంతో నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ముఖ్యమంత్రి నుంచి పరిశ్రమలకు అనుమతి పత్రాలు పొందిన వారిలో ఐటిసి డైరెక్టర్ చిత్తరంజన్ దర్, ఐటిసి తెలంగాణ హెడ్ సంజయ్‌సింగ్, న్యూజెన్ ఇండస్ట్రీస్ ఎండి బి రవీంద్రనాద్, అంజనీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ వెంకటరాజు, ఎంఎస్‌ఎన్ లైఫ్ సైన్సెన్స్ ఎండి ఎన్ రెడ్డి, స్నేహా ఫామ్స్ ఎండి డి రామిరెడ్డి, ఐజంట్ డ్రగ్స్ రీసర్చ్ సొల్యూషన్స్ ప్రతినిధి, పయనీర్ టూర్ స్టీల్ మిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజరాతన్, సౌలిత్రో సిఇఓ టిఎస్ ప్రసాద్, కోవాలంట్ ల్యాబరేటరీస్ ప్రతినిధి అంబుల్గే, భావనా సోలార్ డైరెక్టర్ వివి రావు తదితరులు ఉన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ సానుకూలతను ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత మొదటిసారి తెలంగాణలో 17 పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో అనుమతి పత్రాలను అందజేశారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రం పారిశ్రామిక స్వర్ణయుగం వైపు పురోగమనం ప్రారంభించిందని, అందుకు ఈ కార్యక్రమంతో నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చిన పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి అభినందించారు.

కెసిఆర్

కెసిఆర్

తమ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అనుమతులు ఇవ్వడం పట్ల పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టపరిచే స్థితికి తీసుకుపోయే లక్ష్యంతో సింగిల్ విండో పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు.

కెసిఆర్

కెసిఆర్

పరిశ్రమలకు కావాల్సిన భూమి, నీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తూ అనుమతులను సరళీకృతం చేసిందని ముఖ్యమంత్రి అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కె తారకరామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు పరిశ్రమలశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English summary
Telangana Chief Minister K. Chandrasekhar Rao on Tuesday handed over permit papers to 17 investors, whose applications to set up new industrial units or expand the existing ones were approved within 10 days under the State's new industrial policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X