IPL: క్రికెట్ అభిమానులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
క్రికెట్ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మ్యాచ్‌లు తిలకించే క్రికెట్ అభిమానుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది.
ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆపరేట్ చేయనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనుంది.

ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉప్పల్ స్టేడియంలో మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ తేదీల్లో ఆర్టీసీ బస్సులు క్రికెట్ అభిమానులకు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రధానంగా ఘట్‌కేసర్, హయత్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఎల్బీనగర్, కోఠి, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్, కేపీహెచ్‌బీ, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్‌పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్, మేడ్చల్, వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
కాగా, మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్‌జీ) జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడనుంది. మరోవైపు, మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications