సికింద్రాబాద్ నుంచి కారుచౌకగా IRCTC ఊటీ స్పెషల్ ఎక్స్ ప్రెస్

Hyderabad-Ooty Tourist Special Train: చలికాలంలో హిల్ స్టేషన్లకు పరుగులు పెడుతుంటారు జనం. ఎముకలు కొరికే చలిలో ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాల్లో గడపడానికి ఇష్టపడుతుంటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో గల పర్యాటక ప్రాంతాలకు భారీగా తరళి వెళ్తుంటారు. ఈ వింటర్ సీజన్‌లో ప్రత్యేకించి- ఊటీ, కొడైకెనాల్‌కు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది.

అలాంటి వారి కోసం అల్టీమేట్ ఊటీ పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కూనూర్ కూడా ఇందులో చేర్చింది. మొత్తం అయిదు రాత్రులు/ ఆరు పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. నవంబర్ 4, 19, డిసెంబర్ 30 తేదీల్లో సికింద్రాబాద్ నుండి ఈ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన కనిష్ట ఛార్జీ 13,300 రూపాయలు. గరిష్టంగా 37,000 రూపాయల వరకు ఉంది.

IRCTC Introduces Ultimate Ooty Train Tour from Secunderabad

నవంబర్ 4, 19 తేదీల్లో బయలుదేరి వెళ్లే ఎక్స్ ప్రెస్ లో..

  • కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 30,000 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 17,070 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 15,850 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 9,700, బెడ్ లేకుండా రూ. 9,390లు.
  • స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 27,450 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 14,520 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 13,300 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 7,160, బెడ్ లేకుండా రూ. 6,850లు.

డిసెంబర్ 30న బయలుదేరి వెళ్లే ఎక్స్ ప్రెస్ లో..

  • కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 36,930 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 21,770 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 19,810 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 11,250, బెడ్ లేకుండా రూ. 8,700లు.
  • స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 34,380 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 19,220 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 17,260 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 9,010, బెడ్ లేకుండా రూ. 8,700లు.
  • డిసెంబర్ 31వ తేదీ రాత్రి డీజే మ్యూజిక్, గ్రాండ్ గాలా డిన్నర్ ఏర్పాటు చేసినందున ఈ ప్యాకేజీ రేట్లు అధికం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+