సమ్మర్‌ స్పెషల్: మన సికింద్రాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ- ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే

Secunderabad-Kanyakumari Divya Jyotirlinga express: వేసవి సీజన్‌లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. తిరువణ్ణామలై (అరుణాచలం)- రామేశ్వరం- కన్యాకుమారి పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్రవేశపెట్టింది.

భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. మే 22వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

IRCTC set to run Divya Dakshin Jyotirlinga Yatra tour package from Secunderabad on May 22

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, ఏపీలో విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

ఈ ప్యాకేజీలో తిరువణ్ణామలై- రామేశ్వరం- మధురై- కన్యాకుమారి, తిరువనంతపురం- తిరుచ్చి- తంజావూరు ఉన్నాయి. తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. రామేశ్వరం- రామనాథ స్వామి ఆలయం, మధురై- మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి- కుమారి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమొరియల్‌ను సందర్శించవచ్చు.

Take a Poll

తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి ఆలయం, తిరుచ్చిలో శ్రీరంగనాథ స్వామి దేవస్థానం, తంజావూరులో బృహదీశ్వర ఆలయాలను దర్శించే వీలుందీ టూర్ ప్యాకేజీ ద్వారా. తంజావూరుతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,700 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీలో పెద్దలకు 22,900, పిల్లలకు 21,700 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీలో పెద్దలకు 29,900, పిల్లలకు 28,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+