సికింద్రాబాద్ నుంచి కేరళ స్పెషల్: డ్రీమ్ డెస్టినేషన్లు కవర్
Secunderabad- Kerala Tourist Special Train: చలికాలంలో హిల్ స్టేషన్లకు పరుగులు పెడుతుంటారు జనం. ఎముకలు కొరికే చలిలో ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాల్లో గడపడానికి ఇష్టపడుతుంటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో గల పర్యాటక ప్రాంతాలకు భారీగా తరళి వెళ్తుంటారు. ఈ వింటర్ సీజన్‌లో ప్రత్యేకించి- ఊటీ, కొడైకెనాల్‌కు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది.
అలాంటి వారి కోసం అల్టీమేట్ ఊటీ పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. డ్రీమ్ డెస్టినేషన్లు మున్నార్, అలెప్పీని చూడొచ్చు. మొత్తం అయిదు రాత్రులు/ ఆరు పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:20 నిమిషాలకు సికింద్రాబాద్ నుండి ఈ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన కనిష్ట ఛార్జీ 14,040 రూపాయలు. గరిష్టంగా 37,310 రూపాయల వరకు ఉంది.

కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 33,390 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 19,440 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 16,820 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 10,510, బెడ్ లేకుండా రూ. 8,080లు.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 30,610 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 16,670 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 14,040 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 7,730, బెడ్ లేకుండా రూ. 5,300.
డిసెంబర్ 30న బయలుదేరి వెళ్లే ఎక్స్ ప్రెస్ లో..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 37,310 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 22,880 రూపాయలు. ట్రిపుల్ షేరింగ్ ధర 20,170 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 13,680, బెడ్ లేకుండా రూ. 11,120.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 34,530 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 20,100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 17,390 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 10,900, బెడ్ లేకుండా రూ. 8,350. డిసెంబర్ 31వ తేదీ రాత్రి డీజే మ్యూజిక్, గ్రాండ్ గాలా డిన్నర్ ఏర్పాటు చేసినందున ఈ ప్యాకేజీ రేట్లు అధికం.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications