హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

KCR అంటే ఏమిటో తెలుసా: అర్థం చెప్పిన మంత్రి హరీశ్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం ఆయన కేసీఆర్ గురించి మాట్లాడారు.

కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని KCR అంటే ఏమిటో నిర్వచించారు. K అంటే KNOWLEDGE(జ్ఞానము), C అంటే COMMITMENT(నిబద్ధత), R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని తెలిపారు. ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్‌కు శిరసు వంచి పాదాభివందనం చేశారు.

Telangana Irrigation Minister Harish Rao Says Meaning Of KCR.

సిద్ధిపేట జిల్లా కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సిద్ధిపేట గురించి సీఎం కేసీఆర్ చెబుతుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. సిద్ధిపేట గురించి సీఎంకు చెప్పడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే ఉంటుందన్నారు. సీఎం చెప్పిన మార్గంలోనే నడుచుకుంటున్నామని తెలిపారు.

సిద్ధిపేటకు అన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. ఒక మెడికల్ కళాశాలను సిద్ధిపేటకు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సిద్ధిపేట పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.

English summary
Telangana Irrigation Minister Harish Rao Says Meaning Of KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X