KTR: ఐటీ, సీబీఐ, ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు: కేటీఆర్
బీబీసీ కార్యాలయంలో ఐటీ దాడులపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కి చెందిన ఢిల్లీ కార్యాలయం, ముంబై స్టూడియోలో ఆదాయపు పన్ను శాఖ సోదాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐటీ శాఖ, సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు బీజేపీకి 'అతిపెద్ద కీలుబొమ్మలుగా'మారాయని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
హిండెన్‌బర్గ్‌ను టేకోవరి చేస్తారా..
"ఏమిటి ఆశ్చర్యం!! మోడీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత, IT, CBI, ED వంటి IT ఏజెన్సీలు BBC ఇండియాపై దాడి చేసి బీజీపీకి అతిపెద్ద కీలుబొమ్మలుగా మారినందుకు నవ్వొస్తోందన్నారు. హిండెన్‌బర్గ్‌పై ED దాడులు లేదా శత్రు టేకోవర్ ప్రయత్నమా?" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఐటీ సోదాల్లో భాగంగా ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు వెళ్లమని కోరినట్లు, వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

హిండెన్‌బర్గ్ సంస్థపై ఐటీ దాడి చేయిస్తారా
అదానీ స్టాక్స్‌పై నివేదిక ఇచ్చిన హిండెన్‌బర్గ్ సంస్థపై ఐటీ దాడి చేయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. లేదంటే ఆ సంస్థనే టేకోవర్ చేసుకుంటారా అని ఆయన విమర్శించారు.బీబీసీపై ఐటీ రెయిడ్స్‌కు సంబంధించి వివిధ మీడియా సంస్థలు రాసిన కథనాలను తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
డాక్యుమెంటరీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002 గుజరాత్ అల్లర్లపై రెండు భాగాల సిరీస్ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ది మోడీ క్వశ్చన్ - అని బీబీసీ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ తర్వాత ఈ డాక్యుమెంటరీని నిషేధించింది.
డాక్యుమెంటరీకి లింక్‌లను బ్లాక్ చేయమని ట్విట్టర్, యూట్యూబ్‌ని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ మీడియాలో స్నిప్పెట్‌లను పోస్ట్ చేయకుండా ప్రజలను నిషేధించింది. దాని సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం అత్యవసర అధికారాలను అమలు చేసింది.

జైరాం రమేష్
అదానీ ఇష్యూ నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఐటీ దాడులు జరిపారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. "ఇక్కడ మేము అదానీపై JPCని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం BBC పై దాడులు చేస్తోంది.వినాషకాలే విపరిత బుద్ధి" అని జైరాం రమేష్ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "వావ్, నిజంగానే? ఇంత ఊహించలేదు" అని అన్నారు.












Click it and Unblock the Notifications