Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tiger Nageswara Rao: విడుదల వేళ.. ఉలిక్కి పడ్డ టాలీవుడ్

హైదరాబాద్: టాలీవుడ్‌లో మచ్ అవైటెడ్ మూవీ- టైగర్ నాగేశ్వర రావు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణుదేశాయ్, జిషూ సేన్ గుప్తా, మురళీ శర్మ.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. వంశీ దర్శకుడు. దసరా పండగను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

సుమారు 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియాడికల్ మూవీని అభిషేక్ పిక్చర్స్ పతాకం కింద అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 70వ దశకంలో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన స్టువర్ట్‌పురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగేశ్వర రావు క్యారెక్టర్‌లో రవితేజ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తోన్నాడు.

IT, GST raids on Ravi Tejas upcoming movie Tiger Nageswara Rao production office

విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా యూనిట్‌లో కలకలం చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రొడక్షన్ కార్యాలయంపై ఆదాయపు పన్ను/వస్తు సేవా పన్ను విభాగాల అధికారులు మెరుపుదాడికి దిగారు. హైదరాబాద్‌లో గల ప్రొడక్షన్ ఆఫీస్, నిర్మాత కార్యాలయం, నివాసాలపైనా ఏకకాలంలో ఈ దాడులు ఆరంభమైనట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు, పక్కా సమాచారం అందిన నేపథ్యంలో ఈ రెండు విభాగాల అధికారులు ఈ దాడులు చేపట్టారనే ప్రచారం విస్తృతంగా ఉంది. దీనిపై చిత్రం యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐటీ/జీఎస్టీ అధికారులు ప్రకటన రూపంలో వెల్లడిస్తారని చెబుతున్నారు. ఈ ఘటనతో టాలీవుడ్‌ ఉలిక్కిపడింది. ఐటీ/జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇతర సినిమాల ప్రొడక్షన్ కార్యాలయాల్లో కలకలం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+