తెలంగాణలో ఈ మంత్రుల గెలుపు కష్టమేనట.. హాట్ టాపిక్!!
తెలంగాణా రాష్ట్రంలో నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ దఫా హస్తం హవా కొనసాగుతుంది అని స్పష్టం చేస్తుంది. బీఆర్ఎస్ కు ఈసారి ఓటమి తథ్యం అన్న ప్రచారం సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేసిన 20 సంస్థల్లో 17సంస్థలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి.
అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన మంత్రులు గెలుస్తారా లేదా అన్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన మంత్రివర్గంలో చాలామంది మంత్రులు ఓడిపోతారు అన్న టాక్ ప్రస్తుతం తెలంగాణలో బాగా వినిపిస్తుంది. మొత్తం మంత్రివర్గంలో ముగ్గురు నలుగురు మంత్రులు గెలిస్తే ఎక్కువ అన్నట్టు పరిస్థితి తయారయింది.

ఇక మొత్తం మంత్రులలో మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ గెలుస్తారని తెలుస్తుంది .అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు చాలా మంది ఓటమి పాలవుతారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఓటమిపాలవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఇక ఒకరిద్దరు మంత్రులు గెలుపోటముల మధ్య ఊగిసలాడుతున్నారని చర్చ జరుగుతుంది. చాలామంది మంత్రులు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని అడ్డుకున్న పరిస్థితులు, ప్రజలు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనే చేదు అనుభవం ఎదుర్కొన్న మంత్రులు ప్రజల వ్యతిరేఖతను తగ్గించి తమవైపు సానుకూలంగా మార్చుకోలేకపోయారు.
ఈ క్రమంలో మంత్రుల ఓటమి పక్కా అని చర్చ జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాలలో బలమైన నేతలు ప్రత్యర్థులుగా ఉండగా , కొన్ని నియోజకవర్గాలలో బలమైన నేతలు లేకపోయినప్పటికీ మంత్రులు మాత్రం గెలిచే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తుంది వినిపిస్తుంది ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో తాజా ఎన్నికలు చాలామంది మంత్రులకు షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తుంది
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా











Click it and Unblock the Notifications