రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు: ఏకకాలంలో 15చోట్ల, బంధువుల ఇళ్లలోను, ఫోన్లు స్విచ్చాఫ్

Recommended Video

    రేవంత్ ఇంటి పై ఆదాయపన్ను శాఖ దాడులు

    హైదరాబాద్/కొడంగల్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతలకు షాకులు తగులుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది. రేవంత్ ఇంటి పైన దాడులు నిర్వహించింది.

    చదవండి: జగన్ నుంచి కాపాడింది నేనే, చింతమనేని ఓ రౌడీ, డీజీపీ గారూ! మేమే చర్యలు తీసుకోవాలా?: పవన్ నిప్పులు

    హైదరాబాదు, కొడంగల్‌లోని ఆయన నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం పదిహేనుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ బంధువుల ఇళ్లలోను ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

    రేవంత్ రెడ్డి అలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే

    రేవంత్ రెడ్డి అలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే

    ఆస్తిపత్రాలు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, వ్యాపార లావాదేవీలను పరిశీలిస్తున్నారు. తనను అరెస్ట్ చేస్తారని కొద్ది రోజుల క్రితం అతను సంచలన ప్రకటన చేశారు. ఆయన అలా సంచలన ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ దాడుల కోసం ఢిల్లీ నుంచి రెండు ఐటీ బృందాలు వచ్చాయి.

    నిన్న తిరుమలకు, నేడు ప్రచారానికి

    నిన్న తిరుమలకు, నేడు ప్రచారానికి

    రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో నిన్న (బుధవారం) తిరుమల వెళ్లీ శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గురువారం ఉదయం కొడంగల్‌కు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో దాడులు నిర్వహిస్తున్నారు.

    కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్చాఫ్

    కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్చాఫ్

    రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడి ఇళ్ళతో పాటు, వారి కంపెనీలు, బంధువుల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రేవంత్, అతని సోదరుడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపై కూడా దాడులు జరిగాయి. ఐటీ సోదాల సమయంలో అధికారులు.. ఆయా చోట్ల కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్చాఫ్ చేయించారని తెలుస్తోంది.

    భారీగా అభిమానులు

    భారీగా అభిమానులు

    రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడంతో పాటు ఈడీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దాడుల విషయం తెలియగానే రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలి వచ్చారు. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా తరలి వస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రాజకీయ కక్షలో భాగంగానే ఈ దాడులు అని ఆరోపిస్తున్నారు. సోదాల విషయం తమకు ముందుగా తెలియదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+