Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైకమాండ్ కు జగ్గారెడ్డి సారీ : రేవంత్ వ్యాఖ్యలపై క్లాస్ : మాది అన్నదమ్ముల పంచాయితీ..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఒన్ మ్యాన్ షో కాంగ్రెస్ లో పనికి రాదంటూ జగ్గారెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. రేవంత్‌ ప్రొటోకాల్‌ పాటించడంలేదని, ఆయన పీసీసీ చీఫ్‌ కావడానికి ముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యేనని తెలిపారు. సంగారెడ్డికి వస్తే తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. అసలు చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని, కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీయా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

దీని పైన ఈ రోజున గాంధీ భవన్ లో ఏఐ పీసీసీ ఇంచార్జి కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సమయంలో జగ్గారెడ్డి తన వాదనకు మద్దతుగా చెప్పుకొనే ప్రయత్నం చేసారని సమాచారం. కాగా, పార్టీ సీనియర్ నేత మల్లు రవి అడ్డుకోవటం ఇద్దరి మద్య పార్టీ ఇంఛార్జ్ కార్యదర్శుల సమక్షంలోనే వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది .దీంతో.. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శలు సర్దిచెప్పారు. దీంతో..మెత్తబడని జగ్గారెడ్డి వవరణ ఇచ్చారు. అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడటంపై జగ్గారెడ్డి సారీ చెప్పారు.

Jagga Reddy sorry to AICC incharges on his open comments against TPCC chief Revanth Reddy

''నిన్నటి ఘటనను మరిచిపొండి. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం నా తప్పే. నా వైపు నుంచి తప్పు జరిగింది.. మరోసారి అలా జరగదని వివరణ ఇచ్చా. మీడియా ముందు మాట్లాడొద్దని ఠాగూర్, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ సూచన చేశారు. మాది అన్నదమ్ముల పంచాయితీ లాంటిది. ఏఐసీసీ అధ్యక్షులు సోనియా, రాహుల్ డైరెక్షన్‌లో పనిచేస్తా. మా యుద్ధం టీఆర్ఎస్, బీజేపీ పైనే'' అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే, జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ పైన రేవంత్ రెడ్డి..ఆయన టీం ఎక్కడా స్పందించ లేదు.

గతం కంటే భిన్నంగా కాంగ్రెస్ ఏఐసీసీ నేతలు ఇటువంటి విషయాల పైన వెంటనే స్పందిస్తున్నారు. ప్రతీ వారం పీఏసీ సమావేశం ఏర్పాటు చేయటం..అందు కోసం ప్రత్యేకంగా కమిటీ నియమించటం ద్వారా సమన్వయ ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తున్నారు. కానీ, రేవంత్ ను వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్లు అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ టీపీసీసీ చీఫ్ ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+