పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా, కేసీఆర్ ఆప్తుడికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్..!!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసు వారని ఇన్నాళ్లు తాను ఏమి అనలేదని కానీ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇలాగే మాట్లాడితే తాట తీస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డికి కేసీఆర్ వ్యవసాయ శాఖ ఇస్తే అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇలాంటి వారి అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించటం లేదా అంటూ కవిత ఫైర్ అయ్యారు.

కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు చేసారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన మూడు నాలుగు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని.. చెప్ప లేనంత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మార్వో ఆఫీస్‌ను కాల్చేస్తే కూడా ప్రజలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని.. ఎదురు తిరిగిన 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారంటూ మాజీ మంత్రిపై ఫైర్ అయ్యారు. ఇలాంటి అవినీతిపరుడిని చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయం గా పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి రాచరిక పాలనను తలపించారని కవిత విమర్శలు గుప్పించారు.

jagruthi-kaivitha-strong-warning-for-former-minister-niranjan-reddy-details-here

నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని నిరంజన్ రెడ్డి తనకు తాను నీళ్ల నిరంజనుడు గా పేరు మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. కాగా, తన గురించి ఇంకొక్కసారి ఎక్కడైనా మాట్లాడి తే నీ తాట తీస్తా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో' అంటూ నిరంజన్‌ రెడ్డికి కవిత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. గతంలో హరీష్ పైన కవిత చేసిన వ్యాఖ్యలకు నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొందరు ఎవరికోసమో.. హరీష్ రావును టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రక్షణగా ఉండాల్సిన సమయంలో ప్రత్యర్థులకు ఊతం ఇచ్చేలా మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తేల్చుకోవడానికి పద్ధతులు వేరే ఉన్నాయని సూచించారు. శత్రువులకు బలం చేకూర్చేలా మాట్లాడటంలో ఎజెండా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఇప్పుడు కేసీఆర్ కు ఆప్తుడు అయిన నిరంజన్ రెడ్డి కి కవిత వార్నింగ్ ఇవ్వటం బీఆర్ఎస్ లో సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+