పవన్ కల్యాణ్‌పై చెప్పులతో దాడి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన మీద కొందరు చెప్పులు విసిరిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జనసేన అధినేత మీద చెప్పులతో దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తుంది.
గతంలో పవన్ కల్యాణ్ పర్యటన సమయంలో చోటు చేసుకున్న ఘటనను ..ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. పవన్ కల్యాణ్ తన పార్టీ అభ్యర్థులతో పాటు, బీజేపీ అభ్యర్థుల తరుఫున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే.. తెలంగాణ నాకు పునర్జన్మను ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తానని.. ఇక్కడ ప్రజల అభివృద్ధికి దోహద పడతానని పవన్ హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పిన దగ్గర నుంచే ఆయన మీద ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారని జనసేన నాయకులు చెబుతున్నారు.
పవన్ తెలంగాణలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన వ్యతిరేకులకు నిద్ర పట్టడం లేదని.. కావాలనే ఇలాంటి వీడియోలను తెర మీదకు తీసుకువస్తున్నారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని వారు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications