KTR: పోలీసులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. విజయ్ మద్దూరి వీడియో విడుదల..!
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి వీడియో విడుదల చేశాడు. తన ఒక సాఫ్ట్ వేర్ వ్యాపారిగా చెప్పుకున్నాడు. రాజ్ పాకాల దీపావళి పార్టీకి కుటుంబ సమేతంగా ఆహ్వానించారని విజయ్ చెప్పారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని వివరించాడు. కానీ తమని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న ఆరోపణలు చాలా అన్యాయమని అన్నారు. దీని చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితమే తాము ప్రపంచ పర్యటన చేసి వచ్చినట్లు వివరించారు.
ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా పోలీసులకు చూపించినట్లు తెలిపారు. అయిన కూడా ఎఫ్ఐఆర్ తో తను చెప్పని మాటాలు చెప్పినట్లుగా రాసుకున్నారని ఆరోపించారు. ఇది చాలా తప్పు చెప్పారు. తనకు, తన కుటుంబానికి, అలాగే రాజ్ పాకాలకు ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇది తీరని అన్యాయమని పేర్కొన్నారు. ఇలా చేయడం చాలా తప్పని అన్నారు. ఏవి నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. వారు రాసిన మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తాను మొదట భారతీయుడని చెప్పారు.

అమెరికాలో చదువుకుని అక్కడే 15 సంవత్సరాలు ఉండి అమెరికా పౌరుడిని అయ్యాను. బిసినెస్ చేశారు.. తనకు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తనది మచ్చలేని కేరీర్ అని తెలిపారు. తను ఎన్నో దేశాల్లో వ్యాపారం చేసినట్లు విరించారు. ఇండియాలో తాను ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. తాను చెప్పినట్లు వస్తున్న వార్తలన్నీ తప్పులేనని ఆరోపించారు. కాగా.. విజయ్ మద్దూరి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా తేలడంపై మాట్లాడలేదు.
వీడియో విడుదల చేసిన విజయ్ మద్దూరి.!#KTR #VijayMaddhuri #Telangana #Oneindiatelugu pic.twitter.com/TaXbXMqVhB
— oneindiatelugu (@oneindiatelugu) October 28, 2024
ఆదివారం ఏం మాట్లాడుకుండా ఉన్న అతను ఇప్పుడు వీడియో చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే అతను వీడియో విడుదల చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేటీఆర్ బామ్మర్దిని తప్పించడానికే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయ్ మద్దూరి తప్పు చేయకుంటే.. ప్రెస్ మీటి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. దీపావళి పార్టీ అయితే మద్యం తాగుతారా అని నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications