జన్వాడ ఫాంహౌస్: రాజ్ పాకాలను 7 గంటలపాటు విచారించిన పోలీసులు
జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను పోలీసులు బుధవారం విచారించారు. మోకిల పోలీస్ స్టేషన్‌లో నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ మధ్యలో జన్వాడ ఫాంహౌస్ కు తీసుకెళ్లి సోదాలు చేశారు. విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంపై పోలీసులు ఆరా తీశారు.
విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రాజ్ పాకాలను విచారించారు. విచారణ అనంతరం బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద మోకిల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అలాగే రాజ్ పాకాల మొబైల్‌ను సీజ్ చేశారు. ఏసీపీ రమణగౌడ్ మాట్లాడుతూ.. రాజ్ పాకాల విచారణ పూర్తి అయిందని తెలిపారు. కేసు దర్యాప్తు దశలోనే ఉందన్నారు. అవసరమైతే మరోసారి ఆయనను విచారణకు పిలుస్తామని ఏసీపీ తెలిపారు.

విచారణ అనంతరం రాజ్ పాకాల మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల విచారణకు సహకరించానని చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఫాంహౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీనని.. విజయ్ మద్దూరి ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు. ఎవరికో డ్రగ్ పాజిటివ్ వస్తే నాకేంటి సంబంధమని రాజ్ పాకాల తెలిపారు. తమ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిందన్నారు. ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదానని ప్రశ్నించారు. కావాలనే ఇష్యూను పెద్దదిగా చిత్రీకరించారని రాజ్ పాకాల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో న్యాయవాదితోపాటు ఆయన విచారణకు వచ్చారు. జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఫామ్‌హౌస్ యజమాని రాజ్ పాకాల శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు.
ఈ క్రమంలో భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. దీంతో డ్రగ్స్ టెస్టు నిర్వహించి పోలీసులు రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఈ మేరకు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే, కుటుంబసభ్యులతో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేస్తారా? అని కేటీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. అది రేవ్ పార్టీ కాదని.. ఫ్యామిలీ పార్టీ అని చెప్పారు. అక్కడుంది పురుషులు, మహిళలు కాదు.. భార్యాభర్తలు, కుటుంబసభ్యులు అని అన్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications