జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!!

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నారా. మరో పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరిక ఖాయమని చెబుతున్న వేళ అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు జీవన్ రెడ్డి చేరే పార్టీ పైన సస్పెన్స్ కొన సాగుతోంది. బీఆర్ఎస్.. బీజేపీ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్లు సిద్దంగా ఉన్నాయి. తన మద్దతుదారుల తో సమావేశం అయిన జీవన్ రెడ్డి తన ముందు ప్రత్యామ్నాయాల పైన వివరించారు. కార్యకర్తల సూచనతో ఏ పార్టీలో చేరాలో డిసైడ్ అయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. కాగా, ఇదే సమయంలో కొత్త అంశం తెర మీదకు రావటం తో.. వాట్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది.

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనకు విసుగొచ్చిన రాష్ట్ర ప్రజలు మార్పు రావాలి.. రేవంత్‌ రెడ్డి పోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ ప్రధాన అంశమని తెలిపారు. తెలంగాణకు జీవనాడి ప్రాణహిత జలాలను వాడుకోవడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌ రానున్న రోజుల్లో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తల కోరిక మేరకే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేయటంతో పాటుగా కొత్త పార్టీలో చేరిక పైన తన మద్దతు దారులతో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తనకు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్ల గురించి వివరించారు. ఇదే సమయంలో కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేసారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని మెజార్టీ అభిప్రాయంగా వెల్లడైంది.

jeevan-reddy-latest-demand-before-brs-leaders-amid-joining-in-the-party-with-his-followers

జీవన్ రెడ్డి ప్రతిపాదన.. కేసీఆర్ సానుకూల స్పందన..!

కాగా, ఇదే సమయంలో తనకు బీఆర్ఎస్ లో చేరితో తగిన గుర్తింపు ఇస్తామంటూ ఇచ్చిన హామీ పైన జీవన్ రెడ్డి ముఖ్యులతో చర్చించారు. దీంతో, అందరూ అంగీకరించటంతో మద్దతు దారులతో కలిసి ఈ నెల 13న గులాబీ కండువా కప్పుకోవాలని జీవన్ రెడ్డి నిర్ణయించారు. కాగా.. జగిత్యాలలో నే సభ ఏర్పాటు చేస్తే.. అందులో తాను బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నానని జీవన్ తాజాగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల సీనియార్టీ ఉండటంతో.. ఆ విధంగా తనకు గౌరవం దక్కాలని కోరుకుంటున్నారు. దీంతో.. కేసీఆర్ పార్టీ ప్లీనరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించి.. అదే సభలో జీవన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా.. జీవన్ రెడ్డితో పాటుగా జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరుతారని చెబుతున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డితో పాటుగా ముఖ్యులు ఎవరూ పార్టీ వీడకుండా మంత్రాంగం చేస్తున్నారు. దీంతో, జీవన్ రెడ్డి చేరిన సభ ద్వారా ఉంటుందా.. కేసీఆర్ సమక్షంలో ముందుగా చేరి.. తరువాత సభ ఏర్పాటు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+