హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి జీవితా రాజశేఖర్‌కు ఊరట: హైకోర్టుకు వెళ్తానని శేఖర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చెక్ బౌన్స్ కేసులో సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్స్ కేసును హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు శనివారంనాడు కొట్టేసింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడారు.

తనను కోర్టుకు లాగినవారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్ తీసుకుని కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. తనపై కేసును కొట్టివేయడం సంతోషంగా ఉందని అన్నారు.

Jeevitha Rajasekhar gets relief from cheque bounce case

జీవితా రాజశేఖర్ 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమాను నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్ రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.

కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014 జీవితకు రూ.25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. శనివారం ఆ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, తాను జీవితా రాజశేఖర్‌పై హైకోర్టుకు వెళ్తాననిి సమా శేఖర్ రెడ్డి చెప్పారు.

English summary
Hyderabad Erramanjil court acquited actress Jeevitha Rajasekhar in cheque bounce case filed by Sama Sekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X