హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుకు నోటు: హైకోర్టులో మత్తయ్యకు ఊరట, మిగతా వారి పరిస్థితి ఏంటీ?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టంచిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ పూర్తయింది.

ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మత్తయ్యపై వచ్చిన ఆరోపణలపై కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఓటుకు నోటు కేసులో తనకు ఎలాంటి ప్రమయేం లేదని, ఈ కేసు నుంచి తనను తప్పించాలని మత్తయ్య గతంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు: మత్తయ్యకు ఏసీబీ నోటీసులు కాగా, గతేడాది తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 5 కోట్లు లంచం ఇవ్వజూపిన ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఈ ఓటుకు నోటు కేసులో జెరుసలేం మత్తయ్య డబ్బు అందించినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అతడిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో అతడు ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు టేపుల రూపంలో బయటకు రావడంతో అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.

నేను చేసింది నేరంకాదు, మధ్యవర్తిత్వమే!, ఆ పార్టీల నుంచి ప్రాణహాని: జెరూసలేం మత్తయ్య టేపుల మీడియాలో బయటకు వచ్చిన తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరిగింది. తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి మాట్లాడుతూ ఆ ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు నాయుడి మాటలేనని మీడియా ముఖంగా చెప్పారు.

jerusalem mathaiah gets relief from cash for vote case in high court

ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రావడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏంజరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఓటుకు నోటు కేసు అటకెక్కింది.

అంతేకాదు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ కేసు విషయంలో రాజీ పడ్డారనే వార్తలు అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. అయినప్పటికీ, ఈ కేసులో చంద్రబాబుపై విపక్షాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వైసీపీ అధినేత వైయస్ జగన్ వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై ఓటుకు నోటు విషయంలో నిప్పులు చెరుగుతున్నారు.

సంచలనం: 'ఆయన ఒక్క సంతకం చేస్తే, చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం' ఇక ఇటీవల విశాఖపట్నంలో ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఆ కేసుకు భయపడే తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై మాట్లాడటం లేదని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో మచ్చ లేదని చెప్తోన్న చంద్రబాబు ఈ కేసులో ఆరోపణలు వెంటాడుతూనే ఉన్నాయి.

English summary
jerusalem mathaiah gets relief from cash for vote case in high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X