• search

టెక్కీల సర్వే: బెంగళూరు కంటే హైదరాబాద్ బెస్ట్, త్వరలో సిలికాన్ వ్యాలీగా సిటీ

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ ఉత్తమమైనదని మరోసారి నిరూపితమైంది. పలు అంతర్జాతీయ సంస్థలు, తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం, సులువుగా వ్యాపార నిర్వహణలో తన స్థానాన్ని కాపాడుకోవడం, సానుకూల పరిస్థితులు ఎక్కువగా ఉండటం లాంటి కారణాలతో బెంగళూరుతో పోలిస్తే సాఫ్టువేర్ ఉద్యోగులకు హైదరాబాద్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

  ఐటీ రంగంలో ఉద్యోగుల వలసలు సాధారణం. కానీ దేశీయంగా ఇది 30 నుంచి 60 శాతం ఉంది. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదులో 40 నుంచి 60 శాతం తక్కువగా ఉంటోంది. ఈ మేరకు ఉద్యోగ నియామకాల్లో సంస్థలకు సహాయపడే బిలాంగ్ చేసిన ఓ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ దిగ్గజాలైన ఐబీఎం, ఇన్ఫోసిస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, టీఎస్‌ఎస్, వెల్స్‌ఫార్గో వంటి సంస్థల్లోని ఉద్యోగులకు సంబంధించి గత రెండేళ్ల డాటాను బిలాంగ్ సంస్థ విశ్లేషించింది.

  బెంగళూరు కంటే హైదరాబాదులో తక్కువ వేతనాలు

  బెంగళూరు కంటే హైదరాబాదులో తక్కువ వేతనాలు

  హైదరాబాద్, బెంగళూరులలోని ఐటీ దిగ్గజ కంపెనీలలోని ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించింది. గురువారం నివేదికను విడుదల చేసింది. కొత్త నైపుణ్యాలైన డేటా సైంటిస్ట్‌లు, యూఐ/యూఎక్స్‌ డిజైనర్లలో పనిచేసేవారు దొరకడం కష్టమైనప్పటికీ బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో పది నుంచి ఇరవై శాతం తక్కువ వేతనానికే సంస్థలు ఇక్కడ నిపుణులను నియమించుకుంటున్నాయి.

  వేతనం తక్కువైనా హైదరాబాద్ వైపు మొగ్గు

  వేతనం తక్కువైనా హైదరాబాద్ వైపు మొగ్గు

  పదేళ్లకు మించి అనుభవం ఉన్న డేటా సైంటిస్టులకు బెంగళూరులో ఏడాదికి రూ.20లక్షలకు పైగానే చెల్లిస్తున్నారు. హైదరాబాద్‌లో రూ.15లక్షలు-రూ.20లక్షల మధ్య వస్తోంది. యూఐ/యూక్స్ డిజైనింగ్‌లో పదేళ్ల అనుభవం ఉంటే బెంగళూరులో రూ.20 లక్షల కంటే ఎక్కువ ఇస్తున్నారు. హైదరాబాదులో మాత్రం రూ.20 లక్షల కంటే తక్కువ ఉంటుంది. అయినా హైదరాబాదులో ఉద్యోగానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

  ఇవీ కారణాలు

  ఇవీ కారణాలు

  జాతీయ సగటుతో పోల్చితే ఉద్యోగుల వలస హైదరాబాద్‌లో చాలా తక్కువగా ఉందని తెలిపింది. తక్కువ జీవన వ్యయం, మెరుగైన రోడ్లు, మౌలిక సదుపాయాలు, అందుబాటులో రియల్ ఎస్టేట్ ధరలు, ట్రాఫిక్ సమస్యలు ఇతర నగరాల కంటే తక్కువగా ఉండటం, మెరుగైన రవాణా వ్యవస్థ వంటివి టెక్కీలు కంపెనీల మార్పు కోరుకోకపోవడానికి కారణమని సంస్థ సహవ్యవస్థాపకుడు రిషబ్ కౌల్ తెలిపారు. ఈ కారణాలతో పలు అంతర్జాతీయ సంస్థలు కూడా హైదరాబాదులో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఫేస్‌బుక్, గూగుల్, ఉబేర్, అమెజాన్ వంటివి ఉన్నాయి.

  వేరే నగరాలకు వెళ్తే వేతనాలు వచ్చినా నో!

  వేరే నగరాలకు వెళ్తే వేతనాలు వచ్చినా నో!

  కంపెనీలు మారిస్తే టెక్కీలకు ఇతర మెట్రో నగరాల్లో ఉద్యోగం వస్తుందని, అయితే పెరిగే జీతంతో వేరే నగరానికి మారడం కన్నా పలు కారణాలతో హైదరాబాద్‌లోనే ఉండేందుకు హైదరాబాద్ టెక్కీలు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని టెకీలకు 10-20 శాతం జీతభత్యాలు తక్కువగా ఉన్నాయని, అయినా నగరంలో అనేక అనుకూలతలు ఉండటంతో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కంపెనీల మార్పునకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

  త్వరలో సిలికాన్ వ్యాలీగా

  త్వరలో సిలికాన్ వ్యాలీగా

  ఉద్యోగులు కంపెనీలను మార్చే లక్షణం తక్కువగా ఉన్న నగరంగా గుర్తింపు పొందడం ద్వారా హైదరాబాద్ త్వరలోనే ఇండియన్ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందుతుందని రిషబ్ కౌల్ అన్నారు. తెలంగాణ ఐటీ అనుకూల వాతావరణం ఏర్పాు చేయడంలో కేటీఆర్ కృషి చేశారని, ఇతర నగరాలతో పోలిస్తే వేతనాలు తక్కువ ఉండటం కూడా ఐటీ కంపెనీలకు కలిసి వస్తోందని తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In the tech world where retrenchments have become common, Hyderabad is turning out to be a favourable destination for retaining IT talent in the country. The number of techies losing their jobs in Hyderabad are less than Bengaluru as per a report by an outbound hiring company, Belong.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more