నియోజకవర్గ రాజకీయాల్లో భార్యామణులు.. ఓరుగల్లు ఎమ్మెల్యేలా మజాకా!!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దూకుడు పెంచిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు భార్యలతో రాజకీయాలు చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో దూకుడు పెంచిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి భార్యామణులను రంగంలోకి దించుతున్నారు. భర్తలతో పాటు భార్యలు కూడా జనాలలోకి వెళ్లి జనాల సమస్యలు తెలుసుకోవడంతో పాటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీ ఓటు మాకే అని చెప్పకుండా ఇప్పటి నుండే అమ్మా, తల్లీ అంటూ ఓట్ల కోసం ఆపసోపాలు పడుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేల భార్యల జోష్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేల భార్యల జోష్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా నియోజకవర్గాలలో ఇటువంటి పరిస్థితులే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భర్తల్ని వీర తిలకం దిద్ది ఎలక్షన్లకు పంపిన భార్యామణులు, ఇప్పుడు వారు సైతం నియోజకవర్గాలలో పర్యటిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామంది శాసనసభ్యుల భార్యామణులు రాజకీయాల్లో మరింత జోష్ తో ముందుకు సాగుతుంటే మహిళల ఓటు బ్యాంకు తమ ఖాతాలో పడుతుందని సదరు ఎమ్మెల్యేలు చంకలు గుద్దుకుంటున్నారు.

పాలకుర్తి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న ఉషా దయాకర్ రావు

పాలకుర్తి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న ఉషా దయాకర్ రావు

నియోజకవర్గాలలో పట్టు చేజారకుండా, మహిళల మెప్పు పొందడం కోసం వివిధ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు భార్యామణులను ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇక ఆ కోవలో మొదట చెప్పుకోవాల్సింది పాలకుర్తి ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు. నియోజకవర్గంలో ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం పర్యటనలు చేస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

ఎక్కడ శుభకార్యమైనా, ఏ ఇంట్లో చావైనా మంత్రి గారి భార్య వెళ్ళాల్సిందే. మంత్రిగా రాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉన్న దయాకర్ రావు నియోజకవర్గంలో తిరగకపోయినా ఆ లోటు భర్తీ చేస్తూ ఉషా దయాకర్ రావు పర్యటనలు చేస్తున్నారు.

 భూపాలపల్లిలో ఎమ్మెల్యే భార్య గండ్ర జ్యోతి హంగామా

భూపాలపల్లిలో ఎమ్మెల్యే భార్య గండ్ర జ్యోతి హంగామా

ఇక తర్వాత స్థానంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సతీమణి వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి నిలిచారు. ఆమె కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు. నియోజకవర్గంలో భర్త వెంకటరమణారెడ్డి కంటే గండ్ర జ్యోతినే ఎక్కువగా పర్యటనలు చేస్తూ ప్రజలను కలుస్తూ ప్రజల సమస్యలను గురించి తెలుసుకుంటున్నారు. దీంతో ఆయన సైతం వచ్చే ఎన్నికల్లో నా సీట్ కు డోకా లేదు అన్న ధీమాలో ఉన్నారని తెలుస్తుంది.

నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, వరంగల్ తూర్పులోనూ ఎమ్మెల్యేల స్ట్రాటజీ

నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, వరంగల్ తూర్పులోనూ ఎమ్మెల్యేల స్ట్రాటజీ

ఇక నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పెద్ది స్వప్న కూడా రాజకీయాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కంటే దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సతీమణి వాణి, మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీత మహాలక్ష్మి తమ భర్తల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి హడావిడి చేస్తున్నారు.

ఓరుగల్లు ఎమ్మెల్యేలా మజాకా..

ఓరుగల్లు ఎమ్మెల్యేలా మజాకా..

ఎన్నికల వ్యూహంలో భాగంగా భార్యలను బరిలోకి దించారని కొందరు భావిస్తుంటే, నియోజకవర్గం మీద పట్టు జారకుండా ఉండటం కోసం ఇదొక స్ట్రాటజీ అంటున్నారు మరికొందరు. మహిళా ఓటు బ్యాంకు కొల్లగొట్టాలంటే, అది మహిళలతోనే సాధ్యమవుతుందని భావించి భార్యలను రంగంలోకి దించినట్టుగా చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల సతీమణుల హడావిడి చూస్తే ఓరుగల్లు ఎమ్మెల్యేలా మజాకా అని చెప్పక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+