Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు, ఆ ఒక్కరిపై ఆసక్తికర చర్చ!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో హోరాహోరీగా ప్రచార పర్వం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి కోసం తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ 40 మంది అగ్ర నాయకులతో కూడిన ఈ జాబితాను విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా
ఇప్పటికే ప్రచార పర్వాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్లను ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దింపనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు.

Jubilee Hills by-election Congress star campaigners interesting discussion on that one leader

Take a Poll

విజయశాంతి, రేణుకా చౌదరినే కాదు ఎన్నికల ప్రచారానికి వీరు కూడా
అంతేకాదు సీనియర్ నేతలైన జానారెడ్డి, రేణుకా చౌదరి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, రాములు నాయక్, వి హనుమంతరావు, సీ ఎన్ రెడ్డి, బాబా ఫసియద్దిన్, అజారుద్దీన్, విజయశాంతి వంటి నాయకులు ఉన్నారు. వీరు కూడా ప్రచార బాధ్యతలను స్వీకరించి జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయనున్నారు.

ఫిరాయింపు వివాదంలో ఉన్న ఆ నేత కూడా స్టార్ క్యాంపెయినర్
అయితే ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేగా వివాదాన్ని ఎదుర్కొంటున్న దానం నాగేందర్ పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాద్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారం.. కొత్త చర్చ
ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టు ఆదేశాలతో దానం నాగేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ విచారణ చేపట్టారు. ఇక ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కు దానం నాగేందర్ ను స్టార్ క్యాంపెయినర్ గా వేయడం ఆసక్తిని కలిగిస్తుంది. దానం నాగేందర్ అనర్హత వేటుకు గురైతే ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరో అవకాశం ఉంది. ఇప్పటికే ఒక వివాదాన్ని ఎదుర్కొంటున్న దానం నాగేందర్ ను ఈ ఉపఎన్నిక ప్రచారంలో ఎందుకు స్టార్ క్యాంపెయినర్ గా వేశారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+