జూబ్లీహిల్స్‌లో రాత్రికి రాత్రే మారిపోయిన రాజకీయం..!
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంలో బీఆర్ఎస్ విఫలం కావడానికి, ముఖ్యంగా తెలుగుదేశం (టీడీపీ) ఓటు బ్యాంకు మళ్లింపు, స్థానిక కుటుంబ కలహాలు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, సరిగ్గా ఎన్నికల ముందు మాగంటి కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, లుకలకలు బీఆర్ఎస్‌కు అతిపెద్ద నష్టాన్ని కలిగించాయి. మాగంటి తల్లి, మొదటి భార్య , కొడుకు తెరపైకి వచ్చి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతిని చీల్చి, బీఆర్ఎస్ అభ్యర్థి విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపాయి. స్థానిక ఓటర్లలో ఇది గందరగోళాన్ని సృష్టించింది.

బీఆర్ఎస్ ఓటమికి అత్యంత బలమైన కారణం టీడీపీ ఓటర్ల మద్దతు కోల్పోవడం. గతంలో మాగంటికి అండగా నిలిచిన టీడీపీ ఓటు బ్యాంకు ఈసారి పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో అత్యంత చాకచక్యంగా ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నారు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిరసనలకు, ఆందోళనలకు అనుమతి నిరాకరించడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా, రేవంత్ రెడ్డి... టీడీపీపై సానుభూతి ఉన్న ఓటర్లను, ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఆంధ్రా ప్రాంత ప్రజలను, తమవైపు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా, టీడీపీ ఓటర్లు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కుటుంబ కలహాలు , వ్యూహాత్మక ఓటు బ్యాంకు మళ్లింపు కారణంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బగా, కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నైతిక విజయంగా నిలిచే అవకాశం ఉంది.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications