సుప్రీంకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్- ఏపీ న్యాయమూర్తి పేరును కూడా సిఫారసు

హైదరాబాద్: సుప్రీంకోర్టు కొలీజియం.. ఇవ్వాళ కొందరు సీనియర్ న్యాయమూర్తులను దేశ అత్యున్నత న్యాయస్థానానికి రెకమెండ్ చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. దీన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. సాధారణంగా- కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంటుంది.

ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఉన్నారు. ఆయనతో పాటు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ భట్టి ఉన్నారు. వారిద్దరికీ సుప్రీంకోర్టు కొలీజియం పదోన్నతి కల్పించింది. సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఇటీవలే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

Justice Ujjal Bhuyan and Justice S Venkatanarayana Bhatti

జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాతృ హైకోర్టు గౌహతి హైకోర్టు. 2011 అక్టోబర్ 17వ తేదీన గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ 28వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయపరమైన పలు అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రత్యేకించి- పన్నుల చట్టంలో నిష్ణాతులు.

గౌహతి తరువాత ఉజ్జల్ భూయాన్.. బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. పలు కేసులను డీల్ చేశారు. అనంతరం పదోన్నతి మీద తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి మాతృ న్యాయస్థానం ఏపీ హైకోర్టు. ఆయన స్వస్థలం రాయచోటి జిల్లాలోని మదనపల్లి.

2013 ఏప్రిల్ 12వ తేదీన ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మార్చిలో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. కాగా ఇప్పటివరకు 29 మంది పని చేస్తోన్నారు. తాజాగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టితో ఈ సంఖ్య 31కి చేరింది. జస్టిస్ కృష్ణ మురారి శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+