Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్‌ను కలిసిన కేఏ పాల్?: యుద్ధం ముగిసేది అప్పుడే!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అంటేనే సంచలనం. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలు, ఇచ్చే స్టేట్‌మెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కేవలం చిన్నపాటి ఘర్షణలు కావని, ఇది ముమ్మాటికీ "ప్రపంచ యుద్ధమే" అని డాక్టర్ కేఏ పాల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మయామిలో ఉన్న 'ట్రంప్ నేషనల్' వేదికగా జరిగిన రిపబ్లికన్ నేతల భేటీలో పాల్గొన్న ఆయన, యుద్ధాన్ని ఆపేందుకు తాను రూపొందించిన పీస్ ప్లాన్ (శాంతి ప్రణాళిక)కు అగ్రరాజ్య నేతలు మద్దతు తెలుపుతున్నారని ప్రకటించారు.

KA Paul Claims World War III Will End in a Week Meets Donald Trump in Miami to Propose Global Peace Plan

ఇది ప్రపంచ యుద్ధం: KA Paul

ఈ యుద్ధాన్ని దేవుడు తప్పా, ప్రార్ధనలు తప్పా ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఇది ఇండియా-పాకిస్తాన్ యుద్ధం కాదు. నైజారియా క్రిస్టియన్ -ముస్లీం యుద్ధం కాదు.. సౌత్ సుడాన్-నార్త్ సుడాన్ యుద్ధం కాదు.. ఇలాంటి యుద్ధాలు ఎన్నో ఆపాం. ఇది ప్రపంచ యుద్ధం. చైనా, రష్యా, నార్త్ కొరియా.. అమెరికాను బాంబ్ చేయడానికి సిద్ధమైన ఒక యుద్ధం. అమెరికా వేల టార్గెట్లు పెట్టి ఇరాన్ కు కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసింది. ఇరాన్ ఊరుకుందా.. యూఏఈ, గల్ఫ్, అమెరికా బేస్ క్యాంప్ లను దెబ్బకొట్టి.. వారి సత్తా వారు చూపించుకున్నారు. యుద్ధం రాకూడదనే ఫ్రిబవరి 22 న చెన్నైలో ప్రపంచ శాంతి సదస్సు పెట్టాం. - ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్


అణు బాంబు కుట్ర బయటపెట్టిన పాల్!

ఈ యుద్ధం వెనుక ఒక భయంకరమైన వ్యూహం ఉందని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. చైనా, రష్యా, మరియు ఉత్తర కొరియా దేశాలు ఏకమై అమెరికాపై అణుబాంబు వేయడానికి ప్లాన్ చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం దేశాధినేతల ఈగో వల్ల మొదలైన ఈ యుద్ధం కారణంగా ప్రపంచం భారీ విపత్తును ఎదుర్కొంటోందని, దాన్ని ఆపడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రంగంలోకి 'శాంతి దూత'.. వారంలోనే క్లైమాక్స్?

గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచం ఈ అతిపెద్ద యుద్ధాన్ని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన కేఏ పాల్, తాను ఊరికే కూర్చోలేదని చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ సహా వాటికి మద్దతు తెలుపుతున్న దేశాధినేతలతో తాను చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు తన శాంతి ప్రతిపాదనలకు అంగీకరించారని పాల్ తెలిపారు. అటు ఇరాన్ నేతలు కూడా యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఒక వారం లోపే లేదా అంతకంటే ముందే యుద్ధం ముగిసే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రార్థించండి.. శాంతిని కాపాడండి!

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శాంతి కోసం ప్రార్థించాలని కేఏ పాల్ కోరారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలను ఒప్పించి, వినాశనం వైపు వెళ్తున్న ప్రపంచాన్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+