కేయూ ఘటన: పోలీసులు కొట్టారన్న ఆరోపణలపై వరంగల్ సీపీ సంచలన కామెంట్స్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు కొట్టారంటూ వస్తున్న ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ నేడు స్పందించారు. ప్రశాంత్ అనే విద్యార్థికి నెల క్రితమే గాయమైందని అన్నారు. పోలీసుల దాడిలో అతడి కాలు విరగలేదని చెప్పారు. ఎవరికైనా అనుమానం ఎక్కడికైనా వెళ్లి టెస్టులు చేయించుకోవచ్చని సూచించారు.
ఆందోళనకారులను వీసీ చాంబర్ నుండి బయటకు తీసుకువెళ్తున్న క్రమంలో ఒక విద్యార్థికి మాత్రం చిన్న ఫ్రాక్చర్ అయిందని వివరించారు. లేని గాయాలకు కూడా విద్యార్థులు కట్లు కట్టుకున్నారని ఆరోపించారు. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ చాంబర్ డోర్ పగలగొట్టి కంప్యూటర్లు ధ్వంసం చేశారని, ఆ విద్యార్థులే ఫిబ్రవరి 28వ తేదీన బైరి నరేష్ పై కూడా దాడి చేశారని, పోలీసులు తమను కొట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

యూనివర్సిటీలో తప్పులు జరిగితే కోర్టులలో పోరాడవచ్చు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని ఆయన పేర్కొన్నారు. కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకు నేను గన్ పెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్న వరంగల్ సిపి రంగనాథ్, తానే దగ్గరుండి మరీ కొట్టానని చెబుతున్నారని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
పీహెచ్డీ అడ్మిషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినట్టు భావించినా చట్టపరంగా కోర్టుల ద్వారా విద్యార్థులు తేల్చుకోవచ్చని, కానీ యూనివర్సిటీలో విధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు. కోర్టులో కూడా వైద్య పరీక్షల బోగస్ సర్టిఫికెట్లు పెట్టారన్నారు . తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారని, పాత గాయాలు చూపి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సిపి రంగనాథ్ పేర్కొన్నారు.
కేయూ ఘటన: పోలీసులు కొట్టారన్న ఆరోపణలపై వరంగల్ సీపీ సంచలన కామెంట్స్..!#KU #Warangal #CP #ViralVideo #Oneindiatelugu pic.twitter.com/jv7rnVX674
— oneindiatelugu (@oneindiatelugu) September 7, 2023
ఇలాంటి ఆరోపణలు మాకు కొత్తకాదు అని పేర్కొన్న ఆయన కేయూలో చాలా సంఘాలు ఉన్నా కొందరే ఇలా చేశారని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకోబోమని ముందే హెచ్చరించాం అయినా విద్యార్థులు పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాదు కేయూలో విద్యార్థులు చేసిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలను సిపి మీడియాకు రిలీజ్ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications