హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేదోళ్లు ఆడే స్టేడియం తొలగింపా: జేపీ సిక్స్!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పేద పిల్లలు ఆడుకునేందుకు, యువత క్రికెట్ ఆడుకునేందుకు మైదానాలు కరువవుతున్నాయని, ఇలాంటి సమయంలో పేదవారికి ఆడుకునేందుకు అనుకూలంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతిని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడం విడ్డూరమని, అది పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని రాజకీయ ప్రముఖులు ధ్వజమెత్తారు.

హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతి ఆడిటోరియం నిర్మించవద్దని వారు డిమాండ్ చేశారు. స్టేడియం ఆట మైదానంగానే కొనసాగిస్తూ కళాభారతి వేరేచోట నిర్మించుకోవాలని కోరారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, సీపీఐ నేత నారాయణ, లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణలు వేర్వేరుగా స్టేడియాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేసీఆర్ ప్రతిపక్షాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని డాక్టర్ కే లక్ష్మణ్, కేసీఆర్‌కు అందివచ్చిన ముఖ్యమంత్రి పదవి పిచ్చివాడి చేతిలో రాయిలా మారిందని జేపీ, పేదపిల్లలు ఆడుకునేందుకు మైదానాలు కరువవుతుంటే, ఉన్న మైదానాన్ని కాపాడుకోకుండా ఇలా చేయడం సరికాదని నారాయణలు ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియం వద్ద తెలంగాణ కళాభారతిని నిర్మించే ప్రణాళికను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియం వద్ద తెలంగాణ కళాభారతిని నిర్మించే ప్రణాళికను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం. పోలీసులతో మాట్లాడుతున్న క్రీడాకారులు.

జేపీ

జేపీ

కేసీఆర్‌కు అందివచ్చిన ముఖ్యమంత్రి పదవి పిచ్చివాడి చేతిలో రాయిలా మారిందని లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఎన్టీఆర్ స్టేడియంలో, అక్కడ దగ్గర ఉండే పిల్లలు, యువతనే కాకుండా, పలు ప్రాంతాల నుండి వచ్చి నిత్యం ఆడుకుంటుంటారు. ఇలాంటి స్టేడియాన్ని తొలగిస్తామని చెబుతుండటంతో అందరిలోను ఆందోళన ప్రారంభమైంది.

డాక్టర్ కే లక్ష్మణ్, జేపీ

డాక్టర్ కే లక్ష్మణ్, జేపీ

కేసీఆర్ ప్రతిపక్షాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు.

డాక్టర్ కే లక్ష్మణ్, జేపీ

డాక్టర్ కే లక్ష్మణ్, జేపీ

పేద పిల్లలు ఆడుకునేందుకు, యువత క్రికెట్ ఆడుకునేందుకు మైదానాలు కరువవుతున్నాయని, ఇలాంటి సమయంలో పేదవారికి ఆడుకునేందుకు అనుకూలంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతిని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడం విడ్డూరమని, అది పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని రాజకీయ ప్రముఖులు ధ్వజమెత్తారు.

డాక్టర్ కే లక్ష్మణ్, జేపీ

డాక్టర్ కే లక్ష్మణ్, జేపీ

ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కలియ తిరుగుతున్న బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ.

డాక్టర్ కే లక్ష్మణ్

డాక్టర్ కే లక్ష్మణ్

ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కలియ తిరిగిన అనంతరం క్రికెట్ ఆడుతున్న బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్.

జేపీ

జేపీ

ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కలియ తిరిగిన అనంతరం క్రికెట్ ఆడుతున్న లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ.

జేపీ

జేపీ

లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం నాడు ఇందిరా పార్క్‌ను సందర్శించారు.

జేపీ

జేపీ

లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం నాడు ఇందిరా పార్క్‌ను సందర్శించారు. వివరాలు తెలుసుకుంటున్న దృశ్యం.

చదువు

చదువు

లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం నాడు ఇందిరా పార్క్‌ను సందర్శించారు. చదువుకుంటున్న విద్యార్థులు.

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి

ఎన్టీఆర్ స్టేడియంలో, అక్కడ దగ్గర ఉండే పిల్లలు, యువతనే కాకుండా, పలు ప్రాంతాల నుండి వచ్చి నిత్యం ఆడుకుంటుంటారు. ఇలాంటి స్టేడియాన్ని తొలగిస్తామని చెబుతుండటంతో అందరిలోను ఆందోళన ప్రారంభమైంది.

English summary
Kalabharathi at NTR Stadium Opposed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X