వైభవంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో మహా కుంభాభిషేకం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాఘట్టం మహాకుంభాభిషేకం ఆదివారం వైభవంగా జరిగింది. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహాకుంభాభిషేకం పూజలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, రాజగోపురం కలశాల సంప్రోక్షణ పూజలు, మహా కుంభాభిషేక పూజలు నిర్వహించారు.

ఈ మహా కుంభాభిషేక వేడుకలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపం వద్ద పీఠాధిపతికి స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.

Kaleshwaram Mahakumbhabhishekam celebrated at Sri Kaleshwara Muktheeswara Swamy Temple

తుని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి అనుగ్రహభాషణం అందించారు. కాళేశ్వరం ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందని.. భక్తులందరికీ స్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ మహాఘట్టం మహా కుంభాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక సందర్భంలో స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.

రాజగోపురాలకు సంప్రోక్షణ పూజలు, కుంభాభిషేకం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించి పలు ఫొటోలను మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి నేడు మహకుంభాభిషేకం జరగగా.. సద్గురు సచ్చిదానంద సరస్వతి పర్యవేక్షణలో ఉ.10:42 సుముహూర్తంలో కుంభాభిషేక మహోత్సవం ప్రారంభమైందని మంత్రి తెలిపారు.

ఈ మహా ఘట్టం కోసం దేవాదాయ, ఇతర శాఖల అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మహకుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి హోదాలో తాను, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారని మంత్రి సురేఖ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+